కోమటిరెడ్డి చేతుల్లో కమలం భవిష్యత్?

-

తెలంగాణలో ఓ కీలక ఘట్టానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెరలేపారు…రాబోయే ఎన్నికల్లో ప్రజల మద్ధతు ఎవరి వైపు ఎక్కువ ఉందో డిసైడ్ చేసే సమయం వచ్చేసింది. రాజగోపాల్…కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి…మునుగోడు ఉపఎన్నికని తెరపైకి తీసుకొచ్చారు. ఇక ఈ ఉపఎన్నికే బీజేపీ భవిష్యత్తుని డిసైడ్ చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన ఉపఎన్నికలు బీజేపీ బలాన్ని పెంచుతూ వచ్చాయి…ఇక మునుగోడు ఉపఎన్నిక…బీజేపీని అధికారం వైపుకు తీసుకెళ్లనుంది.

వాస్తవానికి తెలంగాణలో బీజేపీకి పెద్ద బలం లేదు…కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుని సత్తా చాటి…అక్కడ నుంచి బీజేపీ అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. ఇక దుబ్బాక ఉపఎన్నికలో విజయంతో బీజేపీ మరో మెట్టు ఎక్కింది. సాధారణంగా ఉపఎన్నికలో అధికార పార్టీలే గెలుస్తాయి. కానీ అధికార టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టి బీజేపీ గెలిచింది…తర్వాత జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చి బీజేపీ సత్తా చాటింది. ఇక హుజూరాబాద్ ఉపఎన్నిక బీజేపీని మరొక మెట్టు ఎక్కించింది. ఇక్కడ నుంచే బీజేపీలోకి వలసలు పెద్ద ఎత్తున జరిగాయి.

అక్కడ నుంచే బీజేపీ బలం పెరుగుతూ వచ్చింది…టీఆర్ఎస్ పార్టీకి బీజేపీనే ప్రత్యామ్నాయం అనే పరిస్తితికి తీసుకొచ్చింది. అయితే ఇప్పటివరకు ఒక ఎత్తు అయితే..ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక బీజేపీని మరొక ఎత్తుకు తీసుకెళ్లనుంది. మునుగోడులో గెలిస్తేనే..నెక్స్ట్ ఎన్నికల్లో బీజేపీకి ఎదురులేదనే సంగతి అర్ధమవుతుంది.

వాస్తవానికి మునుగోడులో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు బలం ఉంది…అసలు ఇక్కడ బీజేపీ బలం చాలా తక్కువ. ఇప్పుడు ఆ పార్టీ అంతా కోమటిరెడ్డి బలం మీదే ఆధారపడి ఉంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు చెక్ పెట్టి రాజగోపాల్ గెలిస్తే…ఇంకా బీజేపీకి తిరుగులేనట్లే. బలంగానే లేని ఉమ్మడి నల్గొండలో బీజేపీకి బలం పెరిగినట్లే. దీని వల్ల వచ్చే ఎన్నికల్లో ప్రజలు మరింత ఎక్కువగా బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు బీజేపీ భవిష్యత్ అంతా కోమటిరెడ్డి చేతుల్లోనే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news