విద్యుత్‌ సంక్షోభంపై ఏపీ ట్రాన్స్ కో కీలక ప్రకటన

-

విద్యుత్‌ సంక్షోభంపై ఏపీ ట్రాన్స్ కో కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో బొగ్గు కొరత ఉన్నప్పటికీ విద్యుత్ డిమాండ్ తట్టుకునేలా డిస్కంలు పని చేస్తున్నాయని… బొగ్గు కొరత కారణంగా ఏపీలో 2500 మెగావాట్లు మాత్రమే ఏపీ జెన్కో ప్లాంట్లు ఉత్పత్తి చేయగలుగుతున్నాయని పేర్కొంది ఏపీ ట్రాన్స్‌కో. ఏపీ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రోజుకు 70 వేల టన్నుల బొగ్గు అవసరం అవుతుందని.. కొరత కారణంగా సెప్టెంబరు నెలలో 24 వేల టన్నులు మాత్రమే సరఫరా అయ్యిందని వెల్లడించింది.

దేశంలో నెలకొన్న బొగ్గు కొరత కారణంగా ఏపీలో విద్యుత్ సంక్షోభం తలెత్తిందని.. నిరంతరాయ సరఫరా కోసం పీక్ డిమాండ్ ఉన్న సమయంలో ఒక్కో యూనిట్ కు 15-20 రూపాయల వెచ్చించి కొనుగోలు చేయాల్సి వచ్చిందని స్పష్టం చేసింది ట్రాన్స్ కో. బొగ్గుకొరత కారణంగా తక్కువ స్థాయిలో విద్యుత్ అంతరాయాలతో సరఫరాను చేయగలుగుతున్నామని.. ఏపీలో విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం 18,533 మెగావాట్లు అయినప్పటికీ సరిపడినంత విద్యుత్ ఉత్పత్తి కావటం లేదని తెలిపింది.

8075 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు ఉన్నా బేస్ లోడుకు సరిపడినంత విద్యుత్ ఉత్పత్తి కావటం లేదని… 908 గ్యాస్ ఆధారిత ప్లాంట్ల నుంచి 100 మెగావాట్లు మాత్రమే వస్తుందని చెప్పింది. ప్రస్తుతం ఏపీలో 185 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉందని… పీక్ డిమాండ్ మేరకు 9064 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతోందని స్పష్టం చేసింది ఏపీ ట్రాన్స్ కో.

Read more RELATED
Recommended to you

Latest news