ఏపీకి మూడు రోజులపాటు వర్షాలు !

ఏపీకి మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతము నైరుతి రుతుపవనాల ఉపసంహరణ లైన్ 27.1° N అక్షాంశము/84.7° E రేఖాంశము, మోతిహరి, గయా, డాల్టోంగాంజ్, అంబికాపూర్, మండలా, ఇండోర్, గాంధీనగర్, రాజ్‌కోట్ మరియు పోర్బందర్ల గుండా వెళుతుంది. రాబోయే 2-3 రోజుల్లో గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లోని మరికొన్ని ప్రాంతాల నుండి; మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్‌లోని చాలా ప్రాంతాలు నుండి; మహారాష్ట్ర, ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలు నుండి నైరుతి రుతుపవనాలు ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా ఏర్పడ్డాయి.

ఉత్తర అండమాన్ సముద్రము మరియు దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం ప్రస్తుతము సగటు సముద్రమట్టానికి 5.8 సెం.మీ ఎత్తువరకు కొనసాగుతున్నది. దీని ప్రభావం వలన అదే ప్రాంతంలో రాగల 48 గంటలలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

ఇది తదుపరి 4-5 రోజులలో మరింత బలపడి పశ్చిమ-వాయువ్య దిశలో కదలి దక్షిణ ఒడిశా & ఉత్తరకోస్తా ఆంధ్ర ప్రదేశ్ తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉంది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ లకు భారీ వర్షాలు ఉన్నట్లు వెల్లడించింది.