ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత చాలా సందర్భాలలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో వైసిపి పార్టీ ఎప్పుడు ముందు ఉంటుందని చాలా సందర్భాలలో జగన్ తెలపడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని చాలా సందర్భాలలో మాట్లాడిన జగన్ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రజలకు ప్రకటించిన కీలక హామీ విషయంలో జగన్ వెనకడుగు వేసినట్లు ఏపీ మీడియా వర్గాల్లో వార్తలు వినబడుతున్నాయి.
మేటర్ లోకి వెళ్తే రాష్ట్రంలో నిరుద్యోగులకు..ఉద్యోగాలు కల్పించే విధంగా సంవత్సరం మొదటిలోనే ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని ఏ ఏ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అవుతాయో వాటి వివరాలు అన్నీ క్యాలెండర్ రూపంలో తీసుకొస్తామని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ హామీ ఇవ్వడం జరిగింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చి ఆల్రెడీ జనవరి 31 వ తారీకు అయిపోయి ఫిబ్రవరి నెలలో అడుగుపెట్టిన గాని ఇప్పటి వరకు ఉద్యోగుల క్యాలెండర్ విషయంలో ప్రభుత్వం తరఫున క్యాలెండర్ రిలీజ్ కాకపోవడంతో..రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల నుండి తీవ్ర విమర్శలు జగన్ సర్కార్ పై వస్తున్నాయి.
దీంతో హడావిడిగా జగన్ సర్కార్ ఇటీవల ఓ రివ్యూ మీటింగ్ పెట్టుకుని రాష్ట్రంలో 63వేల ఖాళీలు ఉన్నాయని.. ఇంకా పరిశీలన చేయాల్సి ఉందని.. ఫిబ్రవరి 21వ తేదీన మళ్లీ సమావేశం అవుదామని చెప్పి పంపించారు. అయితే క్యాలెండర్ గురించి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ గురించి జగన్ ప్రభుత్వం ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఏపీ అవత జగన్ ఇచ్చిన హామీ నెరవేర్చాలని క్యాలెండర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తోంది.