ఏపీలో పెళ్లి చేసుకునే వారికి శుభవార్త..రేపటి నుంచి అమల్లోకి వైఎస్సార్‌ కల్యాణమస్తు

-

ఏపీ యువతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది జగన్‌ సర్కార్‌. రేపటి నుంచి అమల్లోకి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలు అమలు చేయనుంది జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌. ఇందులో భాగంగానే… ఇవాళ సాయంత్రం వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా వెబ్ సైట్ ప్రారంభించనున్నారు సీఎం జగన్. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సాయంత్రం 3 గంటలకు వెబ్ సైట్ లాంచ్ చేయనున్నారు సీఎం జగన్‌.

 #YSR కళ్యాణమస్తు..మార్గదర్శకాలు

అమ్మాయి వయసు 18,అబ్బాయి వయసు 21 ఏళ్లు కచ్చితంగా నిండాలి. గ్రామాల్లో ఆదాయం నెలకు రూ. 10 వేలు పట్టణాల్లో అయితే నెలకు రూ 12 వేలకు మించకూడదు. వారి ఇళ్ళలో నెలవారి విద్యుత్ వాడకం 300 యూనిట్లు దాటకూడదు. కుటుంబంలో ఇన్ కమ్ టాక్స్ ప్లేయర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు.

తాజాగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రకటించిన అర్హత శరతులు చూస్తే, అన్ని సంక్షేమ పథకాల లాగానే కళ్యాణమస్తు షాది తోఫా పథకానికి 6 దశల్లో తనిఖీలు ఉంటాయని తెలుస్తోంది. వధూవరులు ఇద్దరి కుటుంబ సభ్యుల వివరాలను పరిగణలోకి తీసుకుంటారు. కుటుంబ ఆదాయం నెలకు గ్రామీణ ప్రాంతాల్లో రూ. 10వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలకు మించకూడదు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు వర్తించనుంది. ముస్లింలకు షాదీ తోఫా పేరుతో ఈ పథకం వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ వధూవరులకు రూ. లక్ష, ఒకవేళ వీరు కులాంతర వివాహం చేసుకుంటే రూ. 1.20లక్షలు ఇస్తారు. బీసీలకు రూ. 50 వేలు, వీరు కులాంతర వివాహం చేసుకుంటే రూ. 75 వేల ఆర్థిక సాయం ఉంటుంది. మైనార్టీలకు రూ. లక్ష, దివ్యాంగులైతే రూ. 1.50లక్షలు ఇస్తారు. భవన నిర్మాణ కార్మికులకు రూ. 40వేలు ప్రభుత్వం సాయం చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news