మెగాస్టార్ కాకుండా చిరంజీవికి ఇంకా ఏమేం టైటిల్స్ వాడారో తెలుసా?  

-

తెలుగు చిత్ర పరిశ్రమలో స్వయంకృషితో పైకి వచ్చిన నటులు ఎంతో మంది ఉన్నారు. ఇదే కోవకు చెందిన మెగాస్టార్ చిరంజీవిది అందులో ప్రత్యేక శైలి. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఎన్నో కష్టాల‌ను ఎదుర్కొని మెగాస్టార్ గా ఎదిగారు.

1978లో ప్రాణం ఖరీదు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై ఆయనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అగ్ర స్థాయి హీరోగా పేరు పొందారు. స్వయంకృషితో పైకి వచ్చిన చిరంజీవిని మనం ముద్దుగా మెగాస్టార్ అని పిలుచుకుంటాం.ఎప్పుడైనా మెగాస్టార్ అన్న బిరుదు ఆయనకు ఎలా వచ్చిందో తెలుసుకున్నారా..

ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి వారు అగ్రస్థాయి హీరోలుగా ఉన్న సమయంలో చిరంజీవి హీరోగా నటించి ఎన్నో ఘన విజయాలను అందుకున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ అధినేత అయిన కేఎస్ రామారావు నిర్మాణంలో చిరంజీవి ఎన్నో చిత్రాల్లో నటించి విజయం సాధించారు. అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, మరణ మృదంగం వంటి ఎన్నో చిత్రాలలో నటించి హిట్స్ అందుకున్నారు. ఆ టైంలో కేఎస్ రామారావు చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు ఇచ్చారు.

యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన మరణ మృదంగం చిత్రంలో మొదటి సారిగా చిరంజీవి పేరు ముందు మెగాస్టార్ అని పెట్టారు. అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో కేవలం మెగాస్టార్ అనే బిరుదు మాత్రమే కాక అనేక టైటిల్స్ కూడా వేశారు. అవేమిటో తెలుసుకుందామా.

85 సినిమాలకు చిరంజీవి అనే టైటిల్ వాడారు. డేరింగ్, డాషింగ్ డైనమిక్ అనే టైటిల్స్ 11 సినిమాలకు వాడారు. సుప్రీం హీరో అని 14 సినిమాలకు, మెగాస్టార్ అని 34 సినిమాలకు, నట కిషోర్ : అని 2 సినిమాలకు, సుప్రీం అని 2 సినిమాలకు, రోరింగ్ లయన్ అని 1 సినిమాకు, సుప్రీం స్టార్ అని 1 సినిమాకి, మా ఘరానా చిరంజీవి అని 1 సినిమాకు నట విజేత అని 1 సినిమాకు ఆయనను సంబోధించారు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా ఆయనని గాడ్ ఫాదర్ అని కూడా సంభోదిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news