ఇప్పుడు ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తుంది.. Samsung, Huawei, Oppoతో సహా అనేక స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్‌లోకి అడుగు పెట్టాయి.ఇదే బాటలో యాపిల్ కూడా నడుస్తుంది. ఆపిల్ కూడా తన పోల్డబుల్ ఫోన్ రూపొందిస్తుంది. 2025లో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ కు ‘ఐఫోన్ ఫోల్డ్’ అని పేరు పెట్టబోతున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఫోల్డ్ ఫోన్ గురించి కొన్ని వివరాలు ఇలా ఉన్నాయి..
ఫోల్డబుల్ ఫోన్ ఎలా ఉండబోతోందంటే?
ఇక ఈ ఫోల్డబుల్ ఫోన్‌లో ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
USB-C పోర్టును కలిగి ఉండనున్నట్లు సమాచారం.
మాగ్ సేఫ్ ఫీచర్ ఈ ఐఫోన్‌లో ఫోల్డ్ సపోర్టు చేసే అవకాశం ఉంది.
టచ్ ఐడీతో పాటు ఫేస్ ఐడీని కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.
సామ్ సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ను పోలిన డిజైన్ ఉండబోతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
అంతేకాదు, ఈ ఫోన్ కు క్లామ్ షెల్ డిజైన్ ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అల్ట్రా థిన్ కవర్ గ్లాస్ కోసం LGతో పనిచేస్తున్న యాపిల్..
ఇక Apple ఫోల్డబుల్ ఫోన్ లో ఉపయోగించే అల్ట్రా థిన్ కవర్ గ్లాస్‌ను రూపొందించడానికి LGతో కలిసి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
Apple iPhone, iPad కోసం స్వంత కస్టమ్ చిప్‌లను డిజైన్ చేస్తోంది. అయినప్పటికీ, ఇది 5G కనెక్టివిటీకి సపోర్టు చేయడానికి అనుమతించే మోడెమ్‌ల కోసం చిప్ మేకర్ క్వాల్ కామ్‌పై ఆధారపడుతోంది.
ఫోల్డబుల్ మ్యాక్ బుక్స్ పైనా ఫోకస్..
ఫోన్‌తో పాటు మ్యాక్‌బుక్‌ను కూడా ఫోల్డబుల్ డిస్‌ప్లేతో రూపొందిస్తున్నట్లు సమాచారం.. ఈ మ్యా క్‌బుక్ మోడల్‌లు 2026 లేదంటే 2027లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 8-అంగుళాలు ఉండే అవకాశం ఉంది. మెయిన్ స్క్రీన్ Samsung డిస్‌ప్లేతో కూడిన WQD + ఫ్లెక్సిబుల్ OLED డిస్‌ప్లేతో రావచ్చని తెలుస్తోంది. ఫోల్డబుల్ ఐఫోన్ మార్కెట్‌లోకి వస్తే.. ఐఫోన్ ప్రియులకు పండగే..!