APPSC సంచలన నిర్ణయం..ఆ అభ్యంతరాలకు రూ.100 చెల్లించాలి

-

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నలు, వాటి జవాబుల పై అభ్యర్థులు లేవనెత్తే అభ్యంతరాలకు ఒక్కో దానికి రూ. 100 చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త నిబంధన విధించింది.

ఇటీవల విడుదల చేసిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు అన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. కమిషన్ నిర్వహించే వివిధ పరీక్షల్లో తప్పుడువే అత్యధికంగా ఉంటున్నాయి.

‘కమిషన్ నిర్వహించిన రిక్రూట్మెంట్ పరీక్షల్లో ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ లోని ప్రశ్నలు, వాటి సమాధానాల కీలకు వ్యతిరేకంగా అభ్యర్థులు తప్పుడు, అసంబద్ధమైన అభ్యంతరాలను వేలాదిగా దాఖలు చేస్తున్నారు. వీటిని పరిశీలించి పరిష్కరించే క్రమంలో ఫలితాల ప్రకటన సహా ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో విపరీత జాప్యం జరుగుతోంది. అందువల్ల కమిషన్ నిర్వహించే అన్ని పరీక్షలకు వర్తించేలా ఒక నిబంధన చేర్చాలని కమిషన్ నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Latest news