గర్భిణులు హైహీల్స్‌ వేసుకుంటున్నారా..? అయితే ప్రమాదం..

-

హైహీల్స్‌ కొత్త అందాన్ని తెచ్చిపెడతాయి కానీ.. అంతే ఇబ్బందులను కూడా తెస్తాయి.. ఎలా అంటారా..అది వేసుకునే వారికి మాత్రమే తెలుస్తుంది. అవి వేసుకుని నడుస్తుంటే చూసే మనకు బానే అనిపిస్తుంది.. వారకి మాత్రం రాత్రయ్యే సరికే మడమలు నొప్పి, ఇంకాస్త రోజులైతే మొకాళ్ల నొప్పి.. ఇంకా ముందుకెళ్తే వెన్నునొప్పి..ఈ పరిస్థితుల్లో గర్భిణులు కూడా హైహీల్స్‌ వేసుకుంటారు. మాములు వారైతే పెద్దగా పట్టించుకోబడ్లా..మరీ..గర్భిణులు వేసుకోవచ్చా..! వేస్తే ఇంకేమైనా ప్రమాదం ఉందా..? గర్భధారణ సమయంలో హీల్స్ ధరించడం మంచిది కాదు. దీనికి శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. గర్భధారణ సమయంలో హీల్స్ ఎందుకు ధరించకూడదంటే..

వెన్నునొప్పి: హైహీల్స్ అనేవి మీ భంగిమను ప్రభావితం చేస్తాయి. ఎక్కువసేపు ధరించడం వల్ల కాలి కండరాలు ముందుకు వంగిపోతాయి. దీంతో మీరు ముందుకు వంగి ఉండాల్సి వస్తుంది. గర్భధారణ సమయంలో శరీర బరువు వేగంగా పెరుగుతుంది. ఇది మీ శరీర భంగిమ పై మరింత ప్రభావితం చేస్తుంది. హైహీల్స్ ధరిస్తే వెన్నునొప్పి వస్తుంది. గర్భధారణ సమయంలో వీపు, కాళ్ళ మడమలలో సమస్యలను కలిగిస్తుంది.

కాళ్లలో తిమ్మిర్లు- ఎక్కువసేపు హీల్స్ ధరించినప్పుడు పాదాలలో కండరాలు సంకోచిస్తాయి.. కండరాల తిమ్మిరి ఏర్పడుతుంది. ఇది గర్భధారణ సమయంలో మరింత పెరుగుతుంది.

బ్యాలెన్స్ సమస్యలు: బరువు పెరగడం, హార్మోన్ల మార్పుల కారణంగా చీలమండలు బలహీనంగా అవుతాయి. దీని కారణంగా సమతుల్యత దెబ్బతింటుంది. ఇది బ్యాలెన్స్‌పై ప్రభావం చూపిస్తుంది. ఇది మీకు, పుట్టబోయే బిడ్డకు ప్రమాదకరం.

ఉబ్బిన పాదాలు- గర్భధారణ సమయంలో పాదాలు, చీలమండలు, పాదాలలో వాపు సాధారణం. దీనికి ప్రధాన కారణం సౌకర్యవంతమైన బూట్లు ధరించకపోవడం. టైట్ షూస్, హై హీల్స్ లేదా ప్లాట్‌ఫారమ్ హీల్స్ ధరించడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.

సో..ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి వీలైనంత వరకూ హైహీల్స్‌కు దూరంగానే ఉండేందుకు ప్రయత్నించండి. గర్భీణులు మాత్రమే కాదు.. మాములు వాళ్లు కూడా అకేషనల్‌గా కాకుండా డైలీ వాటిని వినియోగిస్తే భవిష్యత్తులో అనవసరంగా ఇబ్బందులు పడక తప్పదు.

Read more RELATED
Recommended to you

Latest news