మీరు గర్భవతి అని చెప్పే లక్షణాలు ఇవే..?

-

తల్లి కావడం అనేది ప్రతి పెళ్లయిన అమ్మాయికి ఒక గొప్ప వరం. ఈ తీయటి క్షణాలు గడపడానికి ప్రతి వివాహమైన స్త్రీ ఎదురుచూస్తూ ఉంటుంది. గర్భం దాల్చిన మొదటి వారం నుంచి ఎన్నో జాగ్రత్తలు పాటిస్తుంది. అయితే గర్భం నిలబడిందో లేదో అని కొన్ని లక్షణాలను బట్టి గర్భనిర్ధారణ పరీక్షలు లేకుండానే మనం గుర్తించవచ్చు.

గర్భం దాల్చిన తర్వాత శరీరంలో మార్పులు చాలా వస్తూ ఉంటాయి. అదే ఆడవాళ్ళలో మనం గమనించే కొన్ని మార్పులు చేర్పులు అని అంటాం.గర్భం వచ్చిన తర్వాత దీనికి సంబంధించి చాలారకాల హార్మోన్స్ చేంజెస్ బాడీలో వస్తూ ఉంటాయి. Hcg హార్మోన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ వీటి హెచ్చుతగ్గులు జరుగుతూ ఉంటాయి. అయితే ప్రొజెస్టిరాన్ బాగా ఎక్కువగా ఉండటం, hcg హార్మోన్ విడుదల కావటం వల్ల కొన్ని రకాల లక్షణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అవి ఇప్పుడు తెలుసుకుందామా..

నెలసరి ఆగిపోవడం :
గర్భధారణ అయిందని స్త్రీలల్లో మొదటగా కనిపించే లక్షణం పీరియడ్స్ ఆగిపోవడం. నెలకొకసారి క్రమంగా వచ్చే పీరియడ్స్ ఆగిపోవడం లేక ఆలస్యంగా రావడం ఇలా వస్తే గర్భధారణ మొదటి దశగా భావించాలి.

వాంతులు :
ఆ తర్వాత మనం ముఖ్యంగా గమనించవలసిన లక్షణాలలో మొదటిది వాంతులు లేక వికారంగా ఉండటం. స్ట్రాంగ్ పెగ్నెన్సీ ఉంటే వారికి ఎక్కువగా వాంతులు అవుతుంటాయి. వంట చేసినప్పుడు వచ్చే వాసనలు పడక కొంతమందిలో వాంతులురావడం జరుగుతుంటాయి. ఇక మరి కొంతమందికి వాంతి వచ్చినట్టు అనిపించడం, తిండి సహించక పోవడం, అసిడిటి ఎక్కువగా కలగడం వంటివి జరుగుతుంటాయి.

కళ్లుతిరగడం :
రక్త పీడనం పెరగడం కూడా జరుగుతూ ఉంటుంది. రేడియేషన్ కూడా జరుగుతూ ఉంటాయి. గర్భం వచ్చిన తర్వాత మన రక్తంలోకి ఒక 500ml నీరు వచ్చి చేరుతుంది.ఎందుకంటే గర్భం లో ఉన్న శిశువు కి తీసుకెళ్లాల్సిన రక్త సరఫరా కోసం అలా మీరు పెరుగుతుందన్న మాట. దాని మూలాన కొంచెం కొంచెం కళ్ళు తిరిగినట్లు అనిపించడం పడుకుని లేచినప్పుడు కళ్ళు తిరగడం లేక కొంతమంది నిజంగానే పడిపోవడం లాంటి ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కొంతదూరం నడిచిన వెంటనే ఆయాసం రావడం వంటివి జరుగుతాయి.గర్భ ధారణ సమయంలో పౌష్టికహారం తీసుకోవడం వల్ల మనకి, మనకి పుట్టబోయే బిడ్డకి ఎంతో ఆరోగ్యం కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news