వైద్య సేవల పై తెరాస సర్కార్ మరో కీలక నిర్ణయం..

-

తెలంగాణాలో ఈ మధ్య జరుగుతున్న ఘటనల పై ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా పేద ప్రజల కోసం అందుబాటులో ఉన్న ఉచిత అంబులెన్స్ సర్వీసును తీసి వెయ్యడం పై విమర్శలు గుప్పిస్తున్నారు.ప్రజల్లో కెసీఆర్ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది.. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు తెరాస సర్కార్ మరో గుడ్ న్యూస్ ను అందించింది.మరో 131 బస్తీ దవాఖానాలు అందుబాటులోకి రానున్న విషయాన్ని వెల్లడించింది..

హైదరాబాద్​, రంగారెడ్డి, మేడ్చల్​, సంగారెడ్డి, ఆదిలాబాద్​, హనుమకొండ, జగిత్యాల, సూర్యాపేట, సిద్ధిపేట, మహబూబ్​నగర్​, నల్గగొండ, పెద్దపల్లి, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్​, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్​, మంచిర్యాల, వికారాబాద్​, కామారెడ్డి, జోగులాంబ గద్వాల, వనపర్తి, రాజన్న సిరిసిల్లా, మెదక్​ జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.90 శాతం పనులు పూర్తయ్యాయి. అవసరమైన స్టాఫ్​ను వెంటనే రిక్రూట్​ చేయాలని ఫ్యామిలీ వెల్ఫేర్​ కమిషనర్​ శ్వేతా మహంతి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు.

మరోవైపు ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్​ కూడా పోస్టుల రిక్రూట్​కు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. ఒక్కో దవాఖానాలో మెడికల్​ ఆఫీసర్​, స్టాఫ్​నర్సు, సపోర్టు స్టాఫ్​చొప్పున 131 కేంద్రాలకు అనుమతి ఇచ్చారు. మెడికల్​ ఆఫీసర్‌కు ప్రతీ నెల రూ. 52 వేలు, స్టాఫ్​ నర్సుకు రూ. 29,900, సపోర్టు స్టాఫ్​కు రూ. 10 వేల చొప్పున జీతాలను ఇవ్వనున్నారు.టీచింగ్​ ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గనుంది. బస్తీ దవాఖానాల్లో ప్రాథమిక వైద్యం అందడం వలన పేషెంట్లకు గోల్డెన్​ అవర్​ మిస్​ కాకుండా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వీటిలో దాదాపు 57 రకాల రక్త పరీక్షలు నిర్వహించనున్నారు. పేషెంట్ల అవసరాన్ని బట్టి 136 రకాలుగా పెంచే ఛాన్స్​ కూడా ఉన్నదని వైద్య శాఖ అధికారులు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news