ఆ బ్యాంకులు కూడా ఇక ప్రైవేట్ బ్యాంకులేనా?

-

ప్రభుత్వ బ్యాంకుల విలీన ప్రక్రియను ప్రభుత్వం మరోసారి చేపట్టింది..గత మూడేళ్లలో పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు విలీనం కావడం తెలిసిందే. మరిన్ని బ్యాంకుల విలీన ప్రక్రియను త్వరలో కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్నట్లు ఎకనామిక్ టైమ్స్ పత్రిక ఓ కథనంలో వెల్లడించింది. ఈ కథనంలోని వివరాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరహాలో నాలుగైదు సమర్థవంతమైన భారీ ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే దేశంలో ఉండేలా చూడాలని కేంద్రం భావిస్తోంది.

మరిన్ని బ్యాంకులను విలీనం చేసే ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి తెలిపారు.ఇప్పుడు ఏడు భారీ పెద్ద బ్యాంకులు, ఐదు చిన్న బ్యాంకులు ఉన్నాయి.విలీన ప్రక్రియ ద్వారా ప్రభుత్వ రంగంలో నాలుగైదు భారీ బ్యాంకులకు పరిమితం చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సదరు సీనియర్ అధికారి తెలిపారు. విలీనం కానున్న బ్యాంకులు ఈ నెలాఖరుకల్లా ఫీడ్ బ్యాక్ సమర్పించాలని కోరినట్లు తెలిపారు.

విలీనం విషయంలో తుది నిర్ణయం తీసుకునే ముందు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌తో విస్తృత సంప్రదింపులు జరపనున్నట్లు వెల్లడించారు..విలీన ప్రక్రియ తర్వాత చాలా బ్యాంకుల ఆర్థిక పరిస్థితి గత రెండేళ్లుగా బాగా మెరుగుపడినట్లు కేంద్ర ఆర్థిక శాఖ అధికారి తెలిపారు. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో పలు బ్యాంకుల లాభాలు రెండింతలైనట్లు తెలిపారు..12 బ్యాంకులను కేవలం 4 లేదా 5 బ్యాంకులు ఉండేలా చేస్తుంది.పార్లమెంటు వర్షాకాల సమావేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం..

Read more RELATED
Recommended to you

Latest news