రేపు గోదావరి జిల్లాలో సీఎం జగన్ ఏరియల్ సర్వే

-

రేపు మధ్యాహ్నం గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు.ఏరియల్ సర్వే కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.గోదావరి వరదలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సీఎం ఆదేశాలు ఇచ్చారు.వరద ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు.ఇరిగేషన్‌ రివ్యూ సందర్భంగా సీఎం ఆదేశాలు– “గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ రేపు ఏరియల్‌ సర్వే.ఏరియల్‌ సర్వేకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్న అధికారులు.

AP CM Jagan Mohan Reddy

ఉదయం గోదావరికి వస్తున్న వరదలపై ఇరిగేషన్‌ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న సీఎం శ్రీ వైయస్‌.జగన్‌. రానున్న 24 నుంచి 48 గంటల వరకూ వరదనీరు ఇంకా పెరిగే అవకాశం ఉందని సమీక్షా సమావేశంలో తెలిపిన అధికారులు.తెలంగాణలో గోదావరి నదిపై ఉన్న శ్రీరాంసాగర్‌సహా బేసిన్‌లో ఉన్న అన్ని రిజర్వాయర్ల నుంచి కూడా భారీ వరదనీరు విడుదలవుతున్నట్టుగా వివరించిన అధికారులు.

దాదాపు 23 –24 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశం ఉందని తెలిపిన అధికారులు.ఆమేరకు పోలవరం వద్ద, ధవళేశ్వరం వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ దిగువ ప్రాంతాల వారిని అప్రమత్తంచేయాలని సీఎం ఆదేశం. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశం.వరదల కారణంగా ఉత్పన్నమవుతున్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించిన సీఎం. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికి తగిన సౌకర్యాలను కల్పిస్తూ సహాయశిబిరాలను ఏర్పాటు చేయాలన్న సీఎం.

Read more RELATED
Recommended to you

Latest news