వికారాబాద్ నియోజకవర్గములో నిన్న పార్టీ గ్రూప్ తగాదాలపై వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ స్పందించారు.వికారాబాద్ నియోజకవర్గమ్ మర్పల్లి లో జరిగిన ఘటన టి కప్పులో తుఫాన్ లాంటిదని అన్నారు.ఈ విషయంపై తానే జెడ్పీ చైర్మన్ సునీత తో మాట్లాడతానన్నారు.వేరే నియోజకవర్గము వాళ్ళు వికారాబాద్ వచ్చి హడావుడి చేస్తున్నారన్న భావనలో పార్టీ శ్రేణులు ఉన్నాయన్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ తోనే నిన్న వికారాబాద్ లో కొంత ఘర్షణ పూర్వక వాతావరణం నెలకొందన్నారు.
అయితే వికారాబాద్ నియోజకవర్గములో నిన్న జరిగిన పార్టీ గ్రూప్ తగాదాలపై మంత్రి కేటీఆర్ ఆరా తీసినట్లు సమాచారం.ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ,జెడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డితో మాట్లాడారట కేటీఆర్.పార్టీకి నష్టం కలిగించేలా ఎవరు వ్యవహరించకూడదని నేతలకు సూచించినట్లు సమాచారం.