ఇలా చేస్తున్నారా..? అయితే కిడ్నీ వ్యాధులు పక్కా..!

-

ఈ మధ్యకాలంలో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ సమస్యల వలన రకరకాల బాధలు పడాల్సి వస్తోంది. మందులను ఈ మధ్యకాలంలో ఎక్కువమంది వాడుతున్నారు. చిన్న తలనొప్పి కి కానీ కాళ్ల నొప్పికి కానీ తట్టుకోలేక వెంటనే మాత్ర వేసుకుంటున్నారు.

కానీ అలా చెయ్యడం మంచిది కాదు. నొప్పి నివారణలు వంటి మందులు వలన అప్పటికి మాత్రమే పరిష్కారం దొరుకుంటుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వీటి వలన మూత్రపిండాలకు హాని కలుగుతుంది. కనుక అలా మందులు వేసుకోవద్దు. కిడ్నీలు దెబ్బ తినే ఛాన్స్ వుంది. కాబట్టి మందుల్ని ఎక్కువగా వద్దు.

అలానే ఆధారం లో ఉప్పు ని అధికంగా తీసుకోవద్దు. ఉప్పు ఎక్కువ ఉండే ఆహారాలలో సోడియం చాలా ఎక్కువగా ఉంటుంది. దానితో రక్తపోటు పెరుగుతుంది. ఇది కూడా కిడ్నీ సమస్యలకి కారణం అవుతుంది. కాబట్టి ఆహారం లో ఉప్పు ని తగ్గించండి. ప్రాసెస్ చేసిన ఆహారాలలో సోడియం అధికంగా ఉంటుంది. అలానే ఫాస్పరస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కిడ్నీ వ్యాధి ఉన్నవారు ఇవి తీసుకో రాదు. ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకుంటే
మూత్రపిండాలు, ఎముకలకు హాని కలుగుతుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటివి మీరు డైట్ లో తీసుకోండి. అలానే ఎక్కువ నీరు త్రాగడం కూడా మంచిది.
మూత్రపిండాలు శరీరం నుండి సోడియం టాక్సిన్స్‌ను బయటకు పంపిస్తుంది. కిడ్నీ లో రాళ్లను సరిపడా నీళ్లు ని తీసుకుంటే ఈజీగా నివారించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news