రేపు బిజెపి కార్యాలయంలో బండి సంజయ్ దీక్ష

-

రేపు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష చేపట్టనున్నారు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలకు నిరసనగా బండి సంజయ్ ఒకరోజు దీక్ష చేపట్టనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బండి సంజయ్ ఈ దీక్ష చేపట్టనున్నారు. మెడికో ప్రీతిధి హత్యేనని, శవానికి ట్రీట్మెంట్ చేసి ఠాగూర్ సినిమా చూపించారని ఆయన ఆరోపించారు.

ప్రీతి మృతి కేసు పై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. బిఆర్ఎస్ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని బిజెపి ఆరోపిస్తుంది. మహిళలకు బిజెపి అండగా ఉంటుందని చెప్పేందుకే బండి సంజయ్ దీక్షకు దిగుతున్నారని బిజెపి నేతలు తెలిపారు. ఇక ఈ దీక్షకు సంబంధించి పార్టీ శ్రేణులు ఏర్పాటు చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news