మహమ్మారి సమయంలో హోటల్ భోజనమా? ఈ విషయాలు గుర్తుంచుకోండి.

-

మహమ్మారి సమయంలో బయటకు వెళ్ళేముందు చేతిలో శానిటైజర్, మూతికి మాస్క్ మొదలగునవి చూసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. లాక్డౌన్, అన్ లాక్ కారణంగా ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలనే నియమాలు అందరికీ తెలిసివచ్చాయి. కాకపోతే కొన్ని విషయాల్లో ఈ నియమాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. షాపింగ్ మాల్స్, హోటల్స్ కి వెళ్ళేవారు ఇందులో ఎక్కువగా ఉంటున్నారు. మహమ్మారి సమయంలో హోటల్ భోజనం చేయాలనుకునే ప్రతీ ఒక్కరూ కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. అవేంటో ఇక్కడ చూద్దాం.

కరోనా వైరస్ ఇంకా విస్తరిస్తూనే ఉన్నందున భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. గాలి ద్వారా వైరస్ సోకే అవకాశం ఉన్నందున కనీసం 6అడుగుల దూరం పాటించాలి. అదీగాక హోటల్ కి వచ్చి పోయే మనుషులు ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడి టేబుల్స్ పై వైరస్ ఆనవాళ్ళు ఉండే అవకాశం ఉంది. అందువల్ల వాటిని శానిటైజ్ చేయడం కంపల్సరీ.

అలాగే రెస్టారెంట్లలో పనిచేసేవారు కరోనా వైరస్ వ్యాప్తికి కారణం అయ్యే అవకాశం ఎక్కువ. అందువల్ల వారు తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారా లేదా అనేది చూసుకోవాలి. ఎక్కువ మందితో టచ్ లో ఉంటారు కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా మీరు వెళ్ళే హోటలో వెంటిలేషన్ ఎలా ఉందనేది చూసుకోండి. మూసి ఉండి చీకటిగా ఉన్న వాటిల్లోకి వెళ్ళకపోవడమే ఉత్తమం.

హోటల్ లో ఎలాంటి ఆహారాలను తీసుకోవాలి

అనవసరమైన ఆయిల్స్ తో తయారయ్యే ఆహారాలను కాకుండా మీ ఆరోగ్యాన్ని పెంచే ఆహారాలను మాత్రమే తీసుకోండి. కోవిడ్ నుండి కాపాడి రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను మీ డైట్ లో ఉంచండి. దానివల్ల మీకు, మీ శరీరానికి బాగుంటుంది.

వివిధ రకాలైన కూరగాయలు, చిక్కుళ్ళు, అన్ని రుతువులలో దొరికే పండ్లు, గుడ్లు, గింజలు, పాలు, పెరుగు మొదలగునవి మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news