మీరు ఆరోగ్యంగానే ఉన్నారా.. అయితే ఇంట్లోనే ఈ 30 నిమిషాల టెస్ట్ తో చెక్ చేసుకోండి..!

-

ఈరోజుల్లో అందరికి ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువగానే ఉంటుంది. ఒకదాని తర్వత ఒక వైరస్ ఎంట్రీ ఇస్తుండంటో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలనే భావన అయితే అందరిలో ఉంది. అందుకోసం పోషకవిలువల ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటున్నారు. అయితే ఏదైనా సమస్య ముదిరి దాని లక్షణాలు బయటపడినప్పుడే మనకు వచ్చిన జబ్బు ఏంటో అని అసుపత్రికి పరుగెడతాం. చిన్న చిన్న వాటికి చాలామంది ఇంట్లోనే ఏదో ఒక వైద్యం చేస్తుంటారు. అయితే మీరు అసలు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని..ఇంట్లోనే ఉండి ఈ చిట్కాల ద్వారా తెలుసుకోవచ్చు. మీ శరీరంలో ఏవిధమై సమస్యలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఎలానో ఇప్పుడు చూద్దాం.

అరచేతులతో

ఈ పరీక్షలో మీరు మీ అరచేతిలో మీ ఐదువేళ్లను మడవండి. కాస్త, గట్టిగా పట్టుకోవాలి. ఇలా 30 సెకన్లపాటు చేసిన తర్వాత మీ చేతులను మాములు స్థితికి తీసుకురావాలి. ముందుకంటే ఇప్పుడు మీ చేతులు కాస్త తెల్లగా కనిపిస్తాయి. దీనికి కారణం మీ రక్తప్రసరణ. అరచేతిని అలాగే కాసేపు పరీక్షించండి…. ఆ ప్రాంతంలో కాస్త తిమ్మిరిగా ఉన్నట్లయితే, లేదా రక్తం తిరిగి ప్రయాణం చేయడానికి కొంత సమయం లేదా అంతకంటే ఎక్కువ సమయం పడితే అది ఆర్టిరియోస్క్లె రోసిస్కు సంకేతం కావొచ్చు. శరీరంలోని ఇతర భాగాలకు ఆక్సిజన్, పోషకాలను తీసుకెళ్లే రక్తనాళాల్లో మార్పు కనిపిస్తుంది.

గోళ్లు..

రెండో పరీక్ష.. మీ వేళ్ల మూలాలను నొక్కడం. ప్రతి గోరుపై 5 నిమిషాలు ఇలానే చేయండి… మునుపటిలా గోళ్లు తెల్లగా మారతాయి. రక్తప్రసరణ సాధారణ స్థితికి రావడానికి సుమారు 3 సెకన్లు పడుతుంది. మీకు ఏదైనా నొప్పి లేదా అసౌకర్యంగా ఉందేమో గమనించండి.
అంటే బొటనవేలు నొప్పిగా ఉంటే శ్వాసనాళంలో సమస్య వస్తుంది. చూపుడు వేలు నొప్పి ఉంటే.. జీర్ణవ్యవస్థలో లేదా పెద్దపేగులో సమస్య. మధ్య వేలు నొప్పి ఉంటే గుండెనాళ వ్యవస్థలో సమస్య, కుడి వేలిలో సమస్య ఉంటే గుండె సమస్య, చిటికెన వేలు నొప్పి ఉంటే చిన్నపేగు సమస్య ఉందని అర్థం.

కాళ్లు ఎత్తడం..

ఈ పరీక్షలో మీరు నేలపై పడుకోవాలి. చేతులు నిటారుగా పెట్టాలి. ఇప్పుడు రెండు కాళ్లు నెమ్మదిగా పైకి ఎత్తాలి. అలా మీకు వీలైనంత ఎత్తుకు ఎత్తండి. అప్పుడు మీ శరీరం, చేతులు విశ్రాంతి తీసుకున్నట్లుగా ఉండాలి. 30 సెకన్ల పాటు అలాగే ఉండండి.. మీరు 30 సెన్లపాటు అలా ఉండలేకపోతే లేదా చాలా కష్టంగా ఉన్నట్లు అయితే, పొత్తికడుపు లేదా వీపు దిగువ భాగంలో ఏదో సమస్య ఉందని అర్థం.

ఇలా మీకు అనిపిస్తే వెంటనే హైరానా పడిపోకండి..ఓ సారి డాక్టర్ ని సంప్రదించి విషయం చెప్పండి. తదుపరి పరిక్షలు చేసి సమస్య ఎంత వరకూ ఉందో చెప్తారు. టైం పాస్ కి అయినా మీరు ఓ సారి ట్రై చేయండి మరీ.!

Read more RELATED
Recommended to you

Latest news