ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్..మరో జాతీయ రహదారి మంజూరు

-

ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. మరో జాతీయ రహదారి మంజూరు చేసింది కేంద్రం. తిరుపతి-పీలేరు జాతీయ రహదారి రెండులేన్ల రహదారి కావడంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ మార్గాన్ని నాలుగులేన్ల రహదారిగా తీర్చిదిద్దాలని సీఎం వైఎస్‌ జగన్‌ సంకల్పించారు.

ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భాకరాపేట బస్సు రోడ్డు ప్రమాద అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ చొరవతో కేంద్ర ప్రభుత్వం తిరుపతి-పీలేరు జాతీయ రహదారిని నాలుగు లేన్ల రహదారిగా విస్తరించడానికి పచ్చజెండా ఊపింది. సుమారు రూ.వెయ్యికోట్ల వ్యయంతో పనులను ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే టోపో సర్వేను పూర్తి చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news