ఆరోగ్యంగా బరువు పెరగాలని చూస్తున్నారా..? వెంటనే ఇలా చేయండి..!

-

బరువు తక్కువగా ఉన్న వాళ్ళు బరువుని పెంపొందించుకోవడానికి చూస్తూ ఉంటారు. అయితే ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు పెరగడం అంత ఈజీ కాదు. ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు పెరగాలంటే ఆరోగ్య నిపుణులు చెప్పిన ఈ విషయాలను తప్పక ఫాలో అవ్వండి.

అవకాడో నిజంగా సూపర్ ఫుడ్. దీన్ని తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది పైగా ఆరోగ్యకరంగా బరువు పెరగాలని చూసేవాళ్ళు అవకాడో తీసుకోవడం మంచిది. బ్రెయిన్ ఫంక్షన్ బాగుంటుంది అలానే అవకాడో ని తీసుకుంటే చక్కగా బరువు పెరగొచ్చు.
అన్నం కూడా ఆరోగ్యంగా బరువు పెరిగేందుకు సహాయపడుతుంది. ఒక కప్పు అన్నంలో 130 నుండి 200 క్యాలరీలు ఉంటాయి. అన్నంతో పాటుగా మీరు ప్రోటీన్స్ ఉండే వాటిని కూడా చేర్చుకోవడం మంచిది. మంచి కూరగాయల్ని వంటివి అన్నం తో పాటు తీసుకోండి.
నట్ బటర్స్ ని డైట్ లో చేర్చుకోవడం ఉత్తమం. జీడిపప్పు వాల్నట్ పీనట్ బెటర్ ఆల్మండ్ బెటర్ వంటి వాటిని డైట్ లో చేర్చుకుంటే ఆరోగ్యంగా బరువు పెరగడానికి అవుతుంది. మీరు తీసుకునే ఆహార పదార్థాలతో పాటుగా మీరు ఈ నట్ బటర్ ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు.
పప్పులు కూడా ఆరోగ్యంగా బరువు పెరగడానికి సహాయపడతాయి. పప్పు లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని కూడా డైట్లో చేర్చుకోవడం మంచిది. ఫ్యాటీ ఫిష్ ని రెడ్ మీట్ ని కూడా మీరు డైట్ లో చేర్చుకుంటూ ఉండండి.
గుడ్లు కూడా ఆరోగ్యానికి మంచిది. ప్రోటీన్స్ గుడ్లలో ఎక్కువ ఉంటాయి. ఆరోగ్యంగా బరువు పెరగడానికి గుడ్లు కూడా సహాయం చేస్తాయి ఇలా వీటిని కనుక మీరు డైట్ లో తీసుకుంటే కచ్చితంగా ఆరోగ్యంగా బరువు పెరగడానికి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news