ఈరోజుల్లో ఇన్సూరెన్స్ తీసుకొనేవారిసంఖ్య రోజు రోజుకు ఎక్కువగా అవుతుంది..ప్రస్తుతం మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న ఖర్చులతో హెల్త్ ఇన్సూరెన్స్‌కి కూడా కచ్చితంగా ఆర్థిక ప్రణాళికలో చోటు కల్పించాలి..హెల్త్ ఇన్సూరెన్స్, ఆరోగ్య అత్యవసర పరిస్థితుల ఖర్చు కవర్ చేయడమే కాకుండా, ఆరోగ్య సంబంధిత ఖర్చులను ఆదా చేస్తుంది. ఇప్పుడు డే-కేర్, OPD ఖర్చులు, ప్రివెంటివ్ హెల్త్ చెకప్‌ల ఖర్చును కూడా పాలసీలు కవర్ చేస్తున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొనేవారు ముఖ్యంగా ఈ మూడు విషయాల గురించి తెలుసుకోవాలి..
పాలసీ కొనే ముందు పరిశీలించాల్సిన ముఖ్యమైన అంశం క్లెయిమ్స్. పాలసీ అందించే నో-క్లెయిమ్ బోనస్, సంస్థ క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో వివరాలు తప్పకుండా తెలుసుకోవాలి. ఒక సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్ చేయకుంటే, నో క్లెయిమ్ బోనస్ కవరేజీలో ఇంక్రీజ్‌లా కనిపిస్తుంది. ఇలా దీర్ఘకాలంలో పాలసీ సమర్థవంతంగా మారుతుంది. తక్కువ వయసులో పాలసీ తీసుకుంటే, ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండానే తదుపరి కొన్ని సంవత్సరాలకు రెట్టింపు కవరేజీ లభిస్తుంది. Moneycontrol.com, SecureNow హెల్త్ ఇన్సూరెన్స్ రేటింగ్‌లను ప్రచురించాయి. సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లలో క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తిని తెలుసుకోవచ్చు. అంతిమంగా తీసుకునే పాలసీలు కుటుంబ ఆరోగ్య అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి..
డిడక్టిబుల్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మిగిలిన మొత్తాన్ని క్లెయిమ్ చేయడానికి ముందు చెల్లించాల్సిన (ఆసుపత్రి బిల్లు). ఈ మొత్తాన్ని ఇన్సూరెన్స్ అంగ్రిమెంట్‌లో పేర్కొంటారు. దీని ఆధారంగా ఆసుపత్రిలో చేరే ఖర్చుల కోసం కనీసం ఎంత డబ్బు ఏర్పాటు చేసుకోవాలో తెలుసుకోవాలి. డిడక్టిబుల్స్‌ను ప్రతి సంవత్సరం చెల్లిస్తుంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.. ఇన్సూరెన్స్ కు తగ్గట్లు సేవింగ్స్ కూడా ఉన్నాయో లేదో చూసుకోవాలి..
ఇన్సూరెన్స్ కు సంబంధించి కొన్ని విషయాలను సంబంధించి ఎంత క్లెయిమ్ చేయవచ్చో తెలియజేస్తాయి. ఉదాహరణకు ఇన్సూరెన్స్ క్యాన్సర్ చికిత్సను కవర్ చేస్తుంది. అయినప్పటికీ సబ్ లిమిట్ ఉంటే, చికిత్సకు అయిన ఖర్చును పాక్షికంగా మాత్రమే క్లెయిమ్ చేయగలరు. పాలసీలో రూమ్ రెంట్ సబ్ లిమిట్ ఉంటే, కోరుకున్న గదికి అర్హులు కాకపోవచ్చు. సబ్ లిమిట్స్ బీమాదారు చెల్లింపును తగ్గించడంలో సహాయపడతాయి. బీమా చేసిన వ్యక్తి తక్కువ ప్రీమియం చెల్లించే అవకాశాన్ని అందిస్తాయి.. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొనేవాళ్ళు ముందుగా కంపెనీని చెక్ చేసుకోవాలి.. పూర్తి వివరాలను తెలుసుకొని పాలసిని తీసుకోవడం మంచిది..