డేటింగ్ యాప్స్ వాడే వారికి శుభవార్త.. మీరు పంచే ప్రేమ గురించి నమ్మలేని నిజాలు..

-

సోషల్ మీడియా విస్తరణ తర్వాత ఒకరినొకరు కలవడం దాదాపుగా తగ్గిపోయింది. ఏదైనా ఆన్ లైన్లోనే అన్నీ అయిపోతున్నాయి. పలకరించడం దగ్గర నుండి డాక్టరును సంప్రదించడం వరకూ అన్నీ అన్ లైన్లోనే జరుగుతున్నాయి. అందుకే ప్రతీ ఒక్కరూ వంచిన తల ఎత్తకుండా పని చేస్తున్నారు. ఐతే అలా ఎక్కువ సేపు ఫోన్లోనే గడపడం మంచిది కానప్పటికీ, అలా చేసే వాళ్ళు కోకొల్లలు. అదలా ఉంచితే, స్మార్ట్ ఫోన్లో డేటింగ్ యాప్స్ వాడే వారి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

డేటింగ్ యాప్స్ వచ్చాక మనకు తెలియని వారితో మాట్లాడడం, ఎక్కడో ఉన్న వారి పరిస్థితులని అర్థం చేసుకోవడం పెరిగింది. ఇండియాలో ఉన్న వారు ఇంగ్లండ్ అమ్మాయితో ప్రేమలో పడుతున్నారంటే దానిక్కారణం డేటింగ్ యాప్సే. ఐతే ఇందులో నిజమైన ప్రేమ ఉంటుందా? రిలేషన్ షిప్ నిజంగా అంత గట్టిగా ఉండగలదా అని సందేహించే వారు ఈ విషయాలు తెలుసుకోవాలి.

స్విట్జర్లాండ్ లోని ఒకానొక విశ్వ విద్యాలయం అధ్యయనం ప్రకారం, డేటింగ్ యాప్స్ ద్వారా ఒక్కటయ్యే జంటల్లో ప్రేమ ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉందట. రిలేషన్ షిప్ లో ని మజాని వాళ్లే బాగా ఎంజాయ్ చేయగలుగుతున్నారట. ఎక్కడో దూరంగా ఉండి కూడా వాళ్ళ కోసం ఎక్కువగా ఆలోచిస్తున్నారట. సుదూర ప్రాంత ప్రేమల్లో ఎక్కువ నమ్మకం కలిగి ఉంటున్నారట.

దగ్గరలో ఉన్న వారి పట్ల అంతగా ప్రేమ చూపకపోయినా దూరంగా ఉండి, స్మార్ట్ ఫోన్లో పలకరించే వాళ్ళ మధ్య బంధం చాలా గట్టిగా ఉందట. ఐతే ఇది పరిశోధనలో తేలినప్పటికీ, దూరంగా, స్మార్ట్ ఫోన్లలో ప్రేమించే వారు, అవసరాల కోసమే ప్రేమిస్తున్నట్టు నటిస్తారనీ, డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళు కూడా ఉంటారని వీటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చాలా మంది చెప్పే మాట.

Read more RELATED
Recommended to you

Latest news