కీళ్లనొప్పులకు పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా..ఏమాత్రం మంచిదికాదు..వీటితో సమస్యకు చెక్ పెట్టేద్దాం..!

-

మారుతున్న జీవనశైలి, ఆహారంలో లోపించిన పోషకాలు, కడుపునింపుకోవాడనికి తప్ప శరీరంలోని భాగాలకు మేలుచేసి ప్రోటీన్లు, విటమిన్లు లేని భోజనాలు. ఏదో ఒకటి ఆ టైంకు ఇంత తింటే చాలు అన్నట్లు బిజిబిజీగా లంచ్ బాక్స్ లు చేసుకుని పరుగులు. ఇవన్నీ కలిపి 30 ఏళ్లకే కీళ్లనొప్పులు వచ్చేలా చేస్తున్నాయి. ఇప్పుడు ఈ నొప్పులు తగ్గించుకోవడానికి అందరూ వాడే పద్దతి పెయిన్ కిల్లర్స్. పెయిన్ కిల్లర్ వాడటం ఈ మధ్య అందరికి అలవాటు అయిపోయింది. చిన్న చిన్న నొప్పులకు సైతం పెయిన్ కిల్లర్స్ వేసేసుకుంటారు. ముఖ్యంగా..ఆఫీసుల్లో పనిచేసేవాళ్లు, వ్యాపారాలు, కాయకష్టంచేసే వాళ్లు అందరూ….ఒక టాబ్ లెట్ పడేస్తే పని సాగుతుంది అనే ఉద్దేశంతో పెయిన్ కిల్లర్స్ కు అలవాటుపడ్డారు. నొప్పి తెలియకుండా ఉంటుంది కాబట్టి పని ఎక్కువ చేస్తాం. దీనివల్ల సమస్య పరిష్కారం అవటంలేదు. కేవలం నొప్పిని మనకు తెలియకుండా చేస్తున్నాయి అంతే. అంటే లోపల పెయిన్ మీద భారం ఇంకా ఎక్కువ పడుతుంది.

కీళ్లవాతం రావడానికి ప్రధాన కారణం:

కీళ్లవాతం(గౌట్) రావడానికి శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం ప్రధాన కారణం. శరీర కణజాలాల్లో యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం వల్ల తీవ్రమైన కీళ్లనొప్పులు మొదలవుతాయి. ముఖ్యంగా జాయింట్స్ దగ్గర చిన్న స్పటికాల మాదిరిగా యూరిక్ యాసిడ్ పేరుకుపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆది పేరుకుపోతుందో జాయింట్‌లో నొప్పి, వాపు ప్రారంభమవుతుంది.

పెయిన్ కిల్లర్స్ వాడటం వచ్చే దుష్ప్రభావాలు:

ఇలా దీర్ఘకాలంగా ఇవి వాడటం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. ఈ విషయం దాదాపు వాడే అందరికి తెలుసు. పొట్టలో మంటలు రావడం, పేగు ప్రూతలు, అల్సర్లు, లివర్ ఎఫెక్టు అ‌వుతుంది. కిడ్నీలు కూడా వీటివల్ల దెబ్బతింటాయి. మరి తెలిసి తెలిసి రోగాలును కొని తెచ్చుకునే ఈ పెయిన్ కిల్లర్స్ కు ప్రత్యాయ్నాయం లేదా అంటే ఎందుకు లేదు..చక్కగా ఉందంటున్నారు ప్రకృతి వైద్యులు. పెయిన్స్ తగ్గించే సహజ ఆయిల్స్ ఉన్నాయి. ఇవి సైంటిఫిక్ గా ప్రూవ్ అయినాయ్ కూడా. వీటివల్ల జబ్బుతీవ్రత పెరుగదు, నొప్పులు తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఆవనూనె

ఇందులో ఉండే మైరోసిన్ అనే కెమికల్ కాంపౌండ్ లోపల నొప్పిని తెలయజేసే రిసెప్టార్స్ ని శాంతింపజేసి నరాల ద్వారా మెదడుకు నొప్పి ఎక్కువ చేరకుండా తక్కువ నొప్పిని పంపించే మెకానిజం ఈ ఆవనూనె చేస్తుంది. ఇందులో ఒమెగా3 ఫ్లాటీ యాసిడ్ కూడా ఎక్కువగా ఉండటంతో నొప్పిని కలిగించే ఇన్ఫమేషన్ తగ్గించటానికి, సైట్ కైన్స్ ని తొలగిస్తుంది. ఆవనూనెను ఉపయోగించటం చాలామంచిది. ఇంకా ప్రభావం ఎక్కువగా ఉండాలంటే..ఈ ఆవనూనెలో కర్పూరం వేస్తే అది కరిగిపోతుంది. మోకాళ్లనొప్పులు, కీళ్లనొప్పులు, నడుమునొప్పి ఇలా ఎక్కడ నొప్పి ఉన్నా ఈ ఆయిల్ ను అప్లైయ్ చేసి కాపడం పెట్టుకుంటే నొప్పి త్వరగా తగ్గిపోతుంది. 2016లో ఫ్రైడ్ రిచ్ అలక్జాండర్ యూనివర్శిటీ జర్మనీవాళ్లు ఈ ఆయిల్ తో నొప్పులు తగ్గించుకోవచ్చని నిరూపించారు.

వావిలాకు

నొప్పులు తగ్గించుకోవడానికి ఇంకో మార్గాం వావిలాకు..ఇందులో 47 రకాల కెమికల్ కాంపోడ్స్ ఉన్నాయి. సహజంగా మనకు నొప్పి కలిగే చోట ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి. వీటివల్ల నొప్పి తీవ్రత పెరుగుతుంది. ఈ వావిలాకు ప్రోస్టాగ్లాండిన్స్ ఉత్తప్తిని అరికట్టి నొప్పి సహజంగా తగ్గటానికి మేలు చేస్తుంది.

వావిలాకును ఎలా ఉపయోగించాలి.:

knee pain

వావిలాకును గ్రైండ్ చేసి రసం తీసి ఆ రసాన్ని ఆవనూనెలో వేసి మరిగించాలి. వావిలాకులో ఉండే రసంలో నీరంతా పోయేవరకూ మరగించాలి.
ఇది నిల్వ ఉంటుంది. నొప్పులు ఉన్న చోట కాస్త వేడి చేసుకుని రాసుకుని కాపడం పెట్టుకుంటే నొప్పి తగ్గుతుంది.

కాపడటంలో రెండు రకాలు ఉన్నాయి. వేడినీటిది, చల్లనీటిది. మనం పైన చెప్పుకున్నాం ఆయిల్ రాసి కాపడం పెట్టుకోవాలి అని..మరి ఏది పెట్టాలని సందేహం మీకు రావొచ్చు కదా..!

నొప్పితగిలినప్పుడు, పొడుచుకున్నప్పుడు, వాచినప్పుడు ఐస్ ప్యాక్ అప్లైయ్ చేయాలి. తద్వారా రక్తనాళ్లాల్లో ఉబ్బుతగ్గుతుంది, సెల్పింగ్ తగ్గి మంచి ఉపశమనం లభిస్తుంది..గట్టిగా పొడుచుకుని బాగా పెయిన్ ఎక్కువున్నప్పుడు ఐస్ ప్యాక్ పెట్టేసరికి మొద్దబారిపోతుంది. రోజుకు మూడునాలుకు సార్లు ఐస్ ప్యాక్ పెట్టుకుంటే మంచిది.

వాపులు లేకుండా ఒట్టిగా నొప్పి ఉన్న భాగంలో పెయిన్ తట్టుకోవడానికి వేడినీళ్ల కాపటం మంటిది. ఎప్పుడు కాపడం పెట్టాలన్నా ముందు ఆవనూనె వేడిచేసి ఆప్లైయ్ చేసుకుని మద్దనా చేసుకుని అప్పుడు కాపడం పెడితే మంచి ఫలితం ఉంటుంది.

పంటి నొప్పులు, పిప్పిపన్నులు ఉన్నా పెయిన్ కిల్లర్ వేసుకుంటారు. సాధరంగా పట్టినొప్పి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదీ తినలేరు, తాగలేరు కూడా. ఈ సమయంలో కూడా చాలామంది పెయిన్ కిల్లర్ వేసుకోవడానికే మొగ్గు చూపుతారు. అలా కాకుండా లవంగంతో ఈ నొప్పిని తగ్గించుకోవచ్చు.లవంగం నూనె పిప్పిపన్ను కానీ, పంటినొప్పి ఉన్న చోట వేస్తే..ఇందులో ఉండే యూజినాల్ పెయిన్ వచ్చే ఇన్ఫమేషన్ ను తగ్గించేలా చేస్తుంది.

కీళ్లనొప్పులు తగ్గించుకోవడానికి ఆహారంలో వీటిని చేర్చండి;

రాగులు, జొన్నలు, సజ్జలు రోజువారీ ఆహారంలో తీసుకోవాలి. అలా తింటే శరీరానికి కావాల్సిన కీలక పోషకాలు అందుతాయి. ఎముకలు దృఢంగా మారి.. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

అరటి పండ్లు తినడం మంచిది. వీటిలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ఎముకల సాంద్రతను పెంచుతుంది. వీటిలో ఉండే మెగ్నిషియం కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మధుమేహం ఉన్నవాళ్లు మాత్రం డాక్టర్ సలహా మేరకే వీటిని తీసుకోవాలి.

నారింజను రోజూ తింటున్నా కీళ్ల నొప్పుల సమస్య మాయమవుతుంది. వీటిల్లో ఉండే విటమిన్‌ సి ఎముకలకు బలాన్ని ఇచ్చి దృఢంగా మారుస్తుంది.

ఒక గ్లాస్‌ పాలలో అర టీస్పూన్ పసుపు‌ కలుపుకొని తాగితే మంచిది. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ సెప్టిక్‌ గుణాలు ఉంటాయి కాబట్టి.. కీళ్ల నొప్పి తగ్గతుంది.

చేపల్ని తరచూ తినడం మంచిది. వీటిలో ఒమెగా ౩ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే వాపులను తగ్గించి.. కీళ్ల నొప్పులను పోగొడతాయి. రొయ్యలను కూడా తింటుండాలి.. వీటిలో ఉండే విటమిన్‌ కీళ్ల నొప్పులను పోగొడుతుంది.

బ్లూ బెర్రీలు మనకు మార్కెట్‌లో దొరకుతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వీటిని తరచుగా తింటే నొప్పులు, వాపులు తగ్గుతాయి.

పీనట్ బటర్ మనకు మార్కెట్‌లో దొరకుతుంది. దీనిలో ఉండే విటమిన్‌ బి౩ ఎముకలకు ఎంతగానో అవసరం. రోజూ పీనట్‌ బటర్‌ తింటే ఎముకలు దృఢంగా మారి కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

గ్రీన్ టీ తాగితే చాలా మంచిది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు శరీరంలో నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఎముకలు విరగకుండా, వాటి సాంద్రతను పెంచే గుణాలు గ్రీన్‌ టీలో ఉంటాయి.

ఏ భాగల్లో నొప్పులు ఉన్నా ఇలాంటి సహజ మార్గాలను ఎంచుకోవటం మంచిది. నొప్పి తీవ్రత ఎక్కవుగా ఉండి, భరించలేని స్థితిలో ఉంటే తప్పక అప్పుడు పెయిన్ కిల్లర్ వేసుకోవచ్చు. రోజుల తరబడి, సంవత్సరాల తరబడి రోజుకో పెయిన్ కిల్లర్ వేసుకుని జీవనం సాగించేవాళ్లు చాలామంది ఉన్నారు. పెయిన్ కిల్లర్స్ నిత్యం వాడి భవిష్యత్తులో కిడ్నీలు పాడై ఇంకా ఇతర రోగాలను కొని తెచ్చుకునే పరిస్థితి ఎదురవుతుంది. ఇప్పటినుంచే పెయిన్ కిల్లర్స్ కు స్వస్థిచెప్పి..ఆహారంలో వీటిని భాగం చేసుకుని..ఆయిల్స్ లో మర్థన చేయటం మొదలుపెట్టేయండి.!

Read more RELATED
Recommended to you

Latest news