ఉదయం కుడివైపు నుంచే నిద్రలేస్తున్నారా..?

-

నిద్ర గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే.. ఎందుకుంటే ఈరోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో నిద్రలేమి కూడా ఒకటి.. నిద్రలేమికి ఏంటి కారణాలు, ఏం చేస్తే త్వరగా నిద్రపోవచ్చు, ఎటువైపు పడుకోవాలి, ఎలా నిద్రపోవాలి ఇవన్నీ మస్త్‌ ముచ్చట్లు అయినాయి.. ఇప్పుడు నిద్ర ఏవైపు లేవాలి అనేది తెలుసుకుందాం.. ఇంట్రస్టింగ్‌గా ఉంది కదూ.. నిద్రలేవడానికి కూడా ఏ వైపు అని స్పెషల్‌గా ఉంటుందా..? మనకు ఎటువైపు వీలుగా ఉంటే అటువైపు లేస్తాం.. మళ్లీ ఇందులో ఏంటి అనుకుంటున్నారా..? అందులోనే ఉంది అసలైన కథ.. ఉదయాన్నే నిద్రలేవడం మన ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎడమవైపు నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది. కుడివైపునకు నిద్ర లేవడం కూడా మంచిది.

కుడివైపు నుండి లేవడం చాలా మంచిది..
చాలా మంది ఉదయాన్నే కుడివైపు నిద్ర లేస్తారు. నిజం చెప్పాలంటే ఇది మంచి పద్ధతి. ఆయుర్వేదం, ఆధునిక వైద్యం కూడా ఈ అభ్యాసం మంచిదని చెప్తున్నాయి.. ఇది అనేక రకాల ఆరోగ్య సమస్యలు ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. మన మెదడు కుడి వైపు సృజనాత్మక కార్యకలాపాలను నియంత్రిస్తుంది. ఎడమ వైపు తార్కిక శబ్ద కార్యకలాపాలను నియంత్రిస్తుంది. ఉదయం కుడి వైపున మేల్కొలనడం వల్ల మీ రోజు ప్రశాంతంగా, ఒత్తిడి లేకుండా ఉంటుంది.

రాత్రి తాగేసి… ఉదయం ఎడమవైపు నుంచి లేవడం ప్రమాదకరం..

తాగిన వ్యక్తి మరుసటి రోజు హ్యాంగోవర్‌తో మేల్కొంటాడు. కొన్నిసార్లు స్పృహ కోల్పోవచ్చు. కొంతమందికి ఆకలి కూడా వస్తుంది. ఇదే హ్యాంగోవర్‌తో ఉదయం ఎడమవైపు నిద్రలేచినట్లయితే, పడి గాయాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కావాలంటే చూడండి.. హ్యాంగోవర్ ఉన్నవారు ఎక్కువగా ఎడమ వైపే కింద పడిపోతుంటారు. మద్యం సేవించని వారు కూడా ఎడమవైపు నుంచి లేచి ఒక్కసారిగా కిందపడిపోతే కళ్లు తిరగడం ఖాయం. కాబట్టి నిద్రలేవగానే అప్రమత్తంగా ఉండటం చాలా మంచిది. కుడివైపు నుంచి లేవాలి.

లైంగిక చర్యలో పాల్గొంటున్నప్పుడు కూడా..

మీరు లైంగిక చర్యలో పాల్గొన్న తర్వాత మంచం ఎడమ వైపున లేచేందుకు ప్రయత్నిస్తే, అది కుడి వైపున మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. తెల్లవారుజామున కుడివైపు నిద్ర లేవడం మంచిదని కేవలం నమ్మకం కాదు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి వీలైనంత వరకు కుడివైపు నుంచి లేవడానికి ప్రయత్నించండి. ఎడమ పక్క తిరిగి లేచి నిలబడితే.. గుండె మీద ఒత్తిడి పడుతుంది. కాబట్టి.. మీరు ఇక నుంచి కుడివైపు నుంచే నిద్రలేచాలా చూసుకోండి మరీ..!

Read more RELATED
Recommended to you

Exit mobile version