యూత్ కాంగ్రెస్, విద్యార్థి సంఘం నాయకుల అరెస్ట్ అప్రజాస్వామికం అన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. విద్యార్థి, యువజన సమస్యల పరిష్కారం కోసం శాసనసభ కు వచ్చి ఎమ్మెల్యేలను కలిసి వినతిపత్రం ఇవ్వాలనుకున్న యూత్ కాంగ్రెస్, ఎన్.ఎస్.యు.ఐ నగర నాయకులను రాష్ట్ర నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేయడం చట్టవిరుద్దమన్నారు.
అసెంబ్లీ ప్రారంభమవుతున్న తరుణంలో ప్రజా సమస్యలపై నాయకులు వినతిపత్రాలు ఇవ్వడం సహజం.. దాన్ని ఆసరా చేసుకొని హైదరాబాద్ తో పాటు చుట్టూ పక్కల ఉన్న నియోజక వర్గాలలో కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అరెస్టులు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారని మండిపడ్డారు. “యూత్ కాంగ్రెస్ నాయకులు అనిల్ యాదవ్, మోతె రోహిత్, ఎన్ఎస్యుఐ నగర అధ్యక్షులు అభిజిత్ తదితరులను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు.
నగరంలో కాంగ్రెస్ నాయకులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ నేతల అరెస్టును ఖండించారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.అరెస్టు చేసిన యూత్ కాంగ్రెస్,ఎన్ఎస్యూఐ నాయకులను వెంటనే విడుదల చేయాలి” అంటూ డిమాండ్ చేశారు. తక్షణమే నిరుద్యోగ భృతిని ప్రకటించాలని చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి లపై అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. తక్షణమే అర్హులకు రూ.3016 నిరుద్యోగభృతిని అందించాలన్నారు.