జగన్ నీ నిర్ణయం భేష్… దిశ చట్ట౦పై జగన్ కి లేఖ రాసిన ఢిల్లీ సిఎం…!

-

ఆంధ్రప్రదేశ్ లో మహిళల భద్రతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎపి దిశా చట్టంపై ఇప్పుడు సర్వత్రా ప్రసంశలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా చర్చనీయంశంగా మారింది. ప్రధానంగా మహిళా సంఘాలు జగన్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. తమ రాష్ట్రాల్లో కూడా ఈ విధమైన చట్టాలు తీసుకురావాలని పలు రాష్ట్రాలు డిమాండ్ కూడా చేస్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా జగన్ నిర్ణయంపై పలువురు అభినందనలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపధ్యంలోనే జగన్ నిర్ణయంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రసంశల వర్షం కురిపించారు. జగన్ నిర్ణయం భేష్ అంటూ ఆయన లేఖ కూడా రాసారు. దిశ చట్టానికి సంబంధించిన బిల్లును పంపాలని ఆయన జగన్ కి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇక ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం ఈ చట్టంపై తన అభిప్రాయం తెలిపారు. దిశ చట్టం సమర్థవంతంగా అమలైతే అత్యాచార బాధితులకు వేగంగా న్యాయం జరుగుతు౦దన్న వెంకయ్య ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి చర్యలు చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక పలు రాష్ట్రాల విపక్ష పార్టీలు కూడా దీనిపై ఆరా తీస్తున్నాయి. క్రమంగా అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. తెలంగాణాలో దిశా అత్యాచార నిందితులను ఆ రాష్ట్ర పోలీసులు కాల్చి చంపినా సరే మార్పు రావడం లేదు. ఆంధ్రాలో కూడా అత్యాచార ఘటనలు దిశా చట్టం ప్రవేశ పెట్టిన తర్వాత కూడా జరుగుతున్నాయి. కాగా ఈ చట్టం ప్రకారం… 7 రోజుల్లో దర్యాప్తు చేసి… 7 రోజుల్లో తీర్పు వెల్లడించి… 7 రోజుల్లో మరణ శిక్ష అమలు చేయనున్నారు. గత వారం ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశ పెట్టగా… విపక్ష తెలుగుదేశం కూడా మద్దతు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news