ఆర్యన్ ఖాన్ కు మళ్లీ నిరాశే… బెయిల్ పై వాదనలు రేపటికి వాయిదా

-

ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్ కేసులో పట్టుబడ్డ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు మళ్లీ నిరాశే ఎదురైంది. ముంబై హైకోర్ట్ లో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ పై వాదనలు జరిగాయి. కాగా బెయిల్ పై వాదనలను అక్టోబర్ 27కు వాయిదా వేస్తూ కోర్ట్ నిర్ణయం తీసుకుంది. రేపు మధ్యాహ్నం 2:30 తరువాత మరోమారు ముంబై హైకోర్ట్ ముందుకు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ రానుంది. ఆర్యన్ ఖాన్ తరుపున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహాత్గీ వాదనలు వినిపించారు. ఆర్యన్ ఖాన్ కేవలం చీఫ్ గెస్ట్ గా మాత్రమే క్రూయిజ్ షిప్ కు వెళ్లాడని, తన నుంచి ఎటువంటి డ్రగ్స్ ను కూడా ఎన్సీబీ స్వాధీనం చేసుకోలేదని ముకుల్, ఆర్యన్ తరుపున గట్టిగా వాదించారు. మరో గెస్ట్ గా పిలువబడ్డ అర్బాజ్ మర్చంట్ కూడా ఇలానే పార్టీకి వెళ్లాడని కోర్ట్ కు తెలిపాడు. అయితే ఎన్సీబీ కూడా తన వాదనలను బలంగానే వినిపించింది. ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ఇవ్వద్దని, ఒక వేళ బెయిల్ ఇస్తే సాక్షాలు తారుమారయ్యే అవకాశం ఉందని కోర్టులో ఎన్సీబీ వాదించింది. ఆర్యన్ ఖాన్ కు డ్రగ్స్ రాకెట్ తో సంబంధాలు ఉన్నాయని హై కోర్ట్ లో ఎన్సీబీ వాదించింది.

Read more RELATED
Recommended to you

Latest news