నవంబర్ నెలలో 17 రోజులు బ్యాంకులకు సెలవు..!

-

ఏదైనా ముఖ్యమైన బ్యాంక్ పనులు ఉంటే వాటిని వాయిదా వెయ్యకుండా చేసుకోవడం మంచిది. ఎందుకంటే సెలవు రోజుల్లో బ్యాంక్ పనులు చేసుకోవడం అవ్వదు. కనుక ఎప్పటికప్పుడు బ్యాంక్ పనులు పూర్తి చేసుకోవాలి. అయితే నవంబర్ లో బ్యాంకులకు ఏకంగా 17 రోజులు సెలవులు. ఇక దీని కోసం వివరాలని చూస్తే..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల జాబితాను విడుదల చేసింది. ధంతేరాస్, దీపావళి, భాయ్ దూజ్, ఛత్ పూజ , గురు నానక్ జయంతి వంటి పందులు శనివారాలు, ఆదివారాలు మొత్తంగా 17 రోజుల పాటు బ్యాంకులు పని చెయ్యవు.

1 నవంబర్ 2021: కన్నడ రాజ్యోత్సవ/కుట్ కారణంగా, బెంగళూరు మరియు ఇంఫాల్‌లోని సెలవు.

3 నవంబర్ 2021: నరక చతుర్దశి కారణంగా, బెంగళూరులోని అన్ని బ్యాంకులు సెలవు.

4 నవంబర్ 2021: దీపావళి అమావాస్య (లక్ష్మీ పూజ)/దీపావళి/కాళీ పూజ సందర్భంగా అగర్తల, అహ్మదాబాద్, ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, గౌహతి, హైదరాబాద్, లలో బ్యాంకులు సెలవు. అలానే ఇంఫాల్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పనాజీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్ మరియు తిరువనంతపురంలో కూడా సెలవే.

5 నవంబర్ 2021: దీపావళి (బలి ప్రతిపాద)/విక్రమ్ సంవంత్ న్యూ ఇయర్ డే/గోవర్ధన్ పూజ కారణంగా, అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, డెహ్రాడూన్, గాంగ్‌టక్, జైపూర్, కాన్పూర్, లక్నో, ముంబై మరియు నాగ్‌పూర్‌లోని బ్యాంకులు సెలవు.

6 నవంబర్ 2021: భాయ్ దూజ్/చిత్రగుప్త్ జయంతి/లక్ష్మీ పూజ/దీపావళి/నింగోల్ చకౌబాను సందర్భంగా గాంగ్‌టక్, ఇంఫాల్, కాన్పూర్, లక్నో మరియు సిమ్లాలోని బ్యాంకులు సెలవు.

7 నవంబర్ 2021: ఆదివారం

10 నవంబర్ 2021: పాట్నా మరియు రాంచీలలో, ఛత్ పూజ/సూర్య పష్టి దాలా ఛత్ (సాయన్ అర్ధ) జ్ఞాపకార్థం కారణంగా బ్యాంకులకు సెలవు.

11 నవంబర్ 2021: ఛత్ పూజ సందర్భంగా, పాట్నాలో బ్యాంకులకు సెలవు.

12 నవంబర్ 2021: వంగాలా ఫెస్టివల్ కారణంగా, షిల్లాంగ్‌లోని భారతీయ బ్యాంకులకు సెలవు.

13 నవంబర్ 2021: రెండవ శనివారం

14 నవంబర్ 2021: ఆదివారం

19 నవంబర్ 2021: ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, చండీగఢ్, డెహ్రాడూన్, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, రాయ్‌పూర్, రాంచీ, శ్రీనగర్ సిమ్లాలలో గురునానక్ జయంతి/కార్తీక పూర్ణిమ సందర్భంగా సెలవు.

21 నవంబర్ 2021: ఆదివారం

22 నవంబర్ 2021: కనకదాస జయంతిని కారణంగా బెంగళూరులోని బ్యాంకులు సెలవు.

23 నవంబర్ 2021: సెంగ్ కుట్స్‌నెమ్ వేడుకలను కారణంగా షిల్లాంగ్‌లోని బ్యాంకులకు సెలవు.

27 నవంబర్ 2021: నాల్గవ శనివారం

28 నవంబర్ 2021: ఆదివారం

Read more RELATED
Recommended to you

Latest news