Rangamarthanda: మెగాస్టార్ థ్యాంక్స్ చెప్పిన కృష్ణ వంశీ.. ‘రంగమార్తాండ కు చిరుకు సంబంధ‌మేంటీ?

-

Rangamarthanda: ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగమార్తాండ’. మరాఠీలో ఘన విజయం సాధించిన సూపర్ హిట్ క్లాసిక్ ‘నటసమ్రాట్’ చిత్రానికి .. తెలుగు రీమేక్ రంగమార్తాండ. నాటకాన్ని ప్రాణంగా జీవించే కళాకారులు జీవ‌న చిత్రంగా ఈ సినిమా సిద్ధమవుతోంది. ఇందులో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, శివానీ రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

దాదాపుగా మూడు ఏళ్లుగా ఈ సినిమా గురించి వార్తలు వస్తున్నాయి. గ‌తేడాది ఈ సినిమా విడుదల చేయాల‌నుకున్నా.. కరోనా వల్ల ప్లాన్ చేంజ్ అయ్యింది. రంగమార్తాండ సినిమా షూటింగ్ ను ఎట్టకేలకు పూర్తి చేసిన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ విడుదలకు సిద్దం చేస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్​ ప్రొడక్షన్​ వర్క్​ జరుగుతోంది.

ఈ త‌రుణంలో కృష్ణవంశీ విజ్ఞప్తి మేరకు రంగమార్తాండ కోసం చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు ఓకే చెప్పాడంట‌. ఇటీవల ఆ పని కూడా పూర్తి చేయడం జరిగింది.ఈ విషయాన్ని తెలియజేస్తూ మంగళవారం మధ్యాహ్నం కృష్ణవంశీ ఓ ట్వీట్‌ చేశారు. చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు.

కృష్ణవంశీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మాస్ట్రో ఇళయరాజా స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్​లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది కృష్ణ వంశీ కమ్ బ్యాక్ మూవీ కావాల‌ని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news