యోగీ సర్కార్‌పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఫైర్‌..

-

ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మతపరంగా వివక్షను పాటిస్తోందని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. యూపీలో కన్వారియాలు (ఆధ్యాత్మిక పాదయాత్ర చేసే హిందువులు) వెళ్తుంటే.. వారికి పై నుంచి పూల వర్షం కురిపిస్తూ ఆహ్వానం పలుకుతుంటారని.. అదే ముస్లింల ఇళ్లు కూలగొడుతుంటారని మండిపడ్డారు అసదుద్దీన్ ఓవైసీ. పార్లమెంటు భవనం ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. యూపీలోని మీరట్ జిల్లా కలెక్టర్, పోలీస్ చీఫ్ ఇటీవల కన్వారియాలపై పూలు చల్లించడాన్ని ఉద్దేశిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు అసదుద్దీన్ ఓవైసీ. “ప్రజలు కట్టిన పన్నుల సొమ్ముతో కన్వారియాలపై హెలికాప్టర్ తో పూలు చల్లుతారు. సరే మరి మా మీద కూడా కాస్త దయ చూపించండి అని కోరుతున్నాం.

Don't Waste Your Vote On Congress: Asaduddin Owaisi In Madhya Pradesh

మమ్మల్ని కూడా సమానంగా చూడండి. మీరు వారిపై పూలు చల్లుతున్నప్పుడు.. కనీసం మా ఇళ్లను కూలగొట్టకుండా ఉండండి..” అని అసదుద్దీన్ పేర్కొన్నారు. యూపీలోని హాపూర్ లో ఓ కన్వరియా పాదాలకు నొప్పి నివారణ మందును పోలీసు ఇన్ స్పెక్టర్ రాయడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘మీరు వారి కాళ్లకు మసాజ్ చేస్తారు. కానీ షహరన్ పూర్ లో ముస్లిం యువతను తీసుకెళ్లి కొడతారు. ఇదేం వివక్ష? పైనా నేను విభజన రాజకీయాలు చేస్తున్నానని ఆరోపణలు చేస్తారు. కానీ నాది సమానత్వ రాజకీయం. అందరినీ సమానంగా చూడాలనే నేను కోరుతున్నా.. ఒక మతం వారి కోసం ట్రాఫిక్ ను మళ్లిస్తారు. మరో మతం వారిపై బుల్డోజర్లు నడిపిస్తారా?” అని ప్రశ్నించారు అసదుద్దీన్ ఓవైసీ.

 

Read more RELATED
Recommended to you

Latest news