రెమ్యున‌రేష‌న్ త‌గ్గిస్తారా.. సారీ రాజు గారు త‌గ్గేదేలే.. ఇదీ లెక్క‌

-

తెలుగు సినిమా స్థాయి ప్ర‌పంచ స్థాయికి చేరింది. అలాగే హీరోల రెమ్యున‌రేష‌న్ కూడా అంతే లెవ‌ల్లో ఉంటున్నాయి. నిర్మాత‌ల రారాజు గారు రెమ్యున‌రేష‌న్‌లు త‌గ్గిచండంటూ స్టార్ హీరోల‌తో మంత‌నాలు జ‌రుపుతున్న‌ట్లు ఫిలిం స‌ర్కిల్స్‌లో వార్త‌లు వినవ‌స్తున్నాయి. స్టార్ హీరోలైన రామ్ చ‌ర‌ణ్, అల్లు అర్జున్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ లు ఓకే అంటున్నార‌ని గుస‌గుస‌లు వ‌స్తున్నాయి. అంత సీన్ లేదు త‌గ్గేదేలే అంటున్నార‌ని మ‌రో వార్త‌.

క‌రోనా కార‌ణంగా సినీ ప‌రిశ్ర‌మ ప‌రిస్థితి దారుణంగా త‌య్యార‌య్యింది. సినిమా బ‌డ్జెట్ , హీరోల రెమ్యున‌రేష‌న్‌లు పెరిగిపోవ‌డంతో నిర్మాత‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌నేది ప్రొడ్యూస‌ర్స్ వెర్స‌న్‌..
మరోవైపు ఓటీటీలు సినిమా లైఫ్ స్పాన్ త‌గ్గించేస్తున్నాయి. త‌ప్పేది లేక టిక్కెట్ల రేట్లు పెంచే ప‌రిస్థితులు వ‌స్తున్నాయి. స‌గ‌టు ప్రేక్ష‌కులు థియేట‌ర్‌వైపు చూడాలంటే చాలా క‌ష్టంగా మారింది. ఓటీటీల పుణ్య‌మా అని థియేట‌ర్స్ మూసేసే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక సినిమా బ‌డ్జెట్ త‌గ్గాలంటే ముఖ్యంగా హీరోల రెమ్యున‌రేష‌న్ త‌గ్గాల‌ని, బ‌డ్జెట్ అదుపులోకి వ‌స్తుంద‌ని ఫిలిం ఛాంబ‌ర్ నిర్ణ‌యం. ఈమేర‌కు మంత‌నాలు జ‌రుపుతున్నారు.

ఇందులో బాగంగానే దిల్ రాజు స్టార్ హీరోల‌తో మాట్లాడుతున్నారని, దాదాపు స‌క్సెస్ అయ్యే ఛాన్సెన్ ఎక్కువ‌గా ఉన్నాయ‌ని అంటున్నారు. నిజానికి హీరోల రెమ్యున‌రేష‌న్ వారి వారి మార్కెట్‌ని బ‌ట్టి ఉంటుందిం. దానికి అనుగుణంగానే 100 కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్‌లు ఉంటున్నాయి. మ‌రి రెమ్యున‌రేష‌న్ త‌గ్గిస్తే నిర్మాత‌లు లాభ‌ప‌డ‌తారు నిజ‌మే.. స‌మ‌స్య‌ల్లా పెద్ద నిర్మాత‌లకే, చిన్న సినిమాలు తీసుకునే వారికి బ‌డ్జెట్ ప్రాబ్ల‌మ్స్ లేవు, రావు, రాబోవు.

నిజానికి దిల్ రాజు మాట‌కు ఓకే అన్నారంటే దాన‌ర్థం వారు ఇక సొంత నిర్మాణ సంస్థ‌ల్లోనే వారు సినిమాలు తీసుకుంటారని. స్టార్ హీరోల‌కు దాదాపుగా అంద‌రికీ సొంత నిర్మాణ సంస్థ‌లు ఉన్నాయి. రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకుని వేరే సంస్థ‌ల్లో ఎలా న‌టిస్తారు. రాబ‌ట్టుకోగ‌ల క‌థ, క‌థ‌నం, ధైర్యం ఉంటేనే బ‌డా పాన్ ఇండియా సినిమాలు చెయ్యాలి.

ఇదే విష‌యంపై ఫ్యాన్స్ తెగ ఇదైపోతున్నారు. మా హీరో రెమ్యున‌రేష‌న్ 100 కోట్లు ఇంకా పైనే అంటూ జ‌బ్బ‌లు చ‌రుచుకునే వారు.. త‌గ్గిస్తే పాపం ఇబ్బంది ప‌డిపోరు.! ఆశ దోశ అప్ప‌డం వ‌డ‌.. లాభాలొస్తే జేబులో వేసుకుంటారు. న‌ష్టాలొస్తే హీరోల జేబుల‌కు చిల్లు పెడ‌తారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి బ‌డ్జెట్ బ‌ట్టే క్వాలిటీ, గ్రాండియ‌ర్ కోసం పెద్ద హీరోలు కావాల్సిందే..

ఎలా చూసినా రెమ్యున‌రేష‌న్ త‌గ్గించ‌డం అనేది వ‌దిలేసి పార్ట్‌న‌ర్‌షిప్ అనే అంశం మాట్లాడుకుంటే వ‌ర్కౌట్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news