రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఖురేషి సామాజిక వర్గానికి చెందిన ముస్లిం వ్యాపారులందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా జరిగే మాంసం విక్రయాల్లో ఖురేషి సామాజిక వర్గానికి చెందిన వ్యాపారుల ప్రాధాన్యత ఎంతో ఉంటుందన్నారు. వీరందరూ ముందస్తుగా కరోనా పరీక్షలు చేయించుకుంటే ఆశించిన ఫలితాలు ఉంటాయన్నారు.
Barrister @asadowaisi oversaw arrangements for covid-19 testing of meat traders of Charminar. In light of approaching Baqr Eid, it is important that meat traders are well protected https://t.co/9HVXr4cpgH
— AIMIM (@aimim_national) July 21, 2020
అంతేకాకుండా కరోనా పరీక్షలు చేయించుకోవడం ద్వారా తమను తాము కాపాడుకోవడమే కాకుండా సమాజాన్ని కాపాడినట్లు అవుతుందన్నారు. మంగళవారం యాకుత్‌పురా ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీతో కలిసి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చార్మినార్ యునానీ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సదర్భంగా ఆయన ఈ సూచనలు చేశారు.