యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై అసదుద్దీన్ ఓవైసీ షాకింగ్ కామెంట్స్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా బుల్డోజర్ల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. మొన్నటి వరకు ఢిల్లీలో బుల్డోజర్లకు పని చెప్పగా.. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేతలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే మాజీ బీజేపీ నాయకురాలు నుపుర్ శర్మ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయి. ముస్లిం సంఘాల నేతలు మసీదుల వద్ద ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యూపీతోపాటు పలు రాష్ట్రాల్లో నిరసనకారుల ఆందోళనలు వెలువెత్తాయి. దీంతో పోలీసులు, నిరసనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

అసదుద్దీన్ ఓవైసీ
అసదుద్దీన్ ఓవైసీ

దీంతో యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో హింసాత్మక ఘటనకు ప్రధాన సూత్రధారి అయిన జావేద్ మహ్మద్ ఇంటిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూల్చివేసింది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని కచ్ నగరంలో ఓ ర్యాలీలో పాల్గొన్న మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఏ కారణం లేకుండా దోషులుగా నిర్ణయిస్తున్నారని, వారి ఇళ్లను కూల్చేస్తున్నారని మండిపడ్డారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.