విజయవాడ బాలిక కిడ్నాప్ కేసులో కీలక మలుపు

-

విజయవాడ రైల్వేస్టేషన్‌లో బాలిక కిడ్నాప్ కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ మేరకు కిడ్నాప్ చేసిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో మహిళతో కలిసి బాలికను విజయ అనే మహిళకు అమ్మేసినట్లు పోలీసుల విచారణ తేలింది. సీసీ ఫుటేజీలో కిడ్నాపర్‌ను గుర్తించామని తెలిపారు. కిడ్నాపర్ విజయతోపాటు అంగన్‌వాడీ ఆయాను విచారణ జరుపుతున్నారు. కాగా, విజయవాడ రైల్వే స్టేషన్‌లో మూడేళ్ల బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. తల్లిదండ్రులు నిద్రిస్తుండగా.. పట్టపగలే చిన్నారిని ఇద్దరు మహిళలను కిడ్నాప్ చేశారు.

షఫీదా-కిడ్నాప్
షఫీదా-కిడ్నాప్

ఐదు రోజుల క్రితం విజయవాడ రైల్వేస్టేషన్‌లో పదో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై ఈ ఘటన జరిగింది. ప్రకాశం జిల్లాకు చెందిన అంజనేయులు, విజయవాడకు చెందిన ముస్లిం మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వారికి షఫీదా అనే పాప పుట్టింది. అంజనేయులు నగరంలో కూలి పని చేస్తుండగా.. అతడి భార్య చెత్త కాగితాలు ఏరుతుంది. ఇద్దరూ కలిసి రైల్వే స్టేషన్‌లో నివాసముంటున్నారు. కాగా, షఫీదాను ఇద్దరు మహిళలు ఎత్తుకెళ్లారు. చిన్నారి కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు రైల్వే స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.. నిందితులను పట్టుకున్నారు. ప్రస్తుతం బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news