దుర్గమ్మకు సారె సమర్పించిన శ్రీ శైవక్షేత్రం పీఠాధిపతి

-

నేటి నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ క్షేత్రంలో ఆషాడమాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అయితే నేటి నుంచి జూలై 28 వరకు దుర్గమ్మకు సారె సమర్పించేందుకు అధికారుల ఏర్పాటు చేశారు. అయితే నేడు కనకదుర్గమ్మకు అమ్మవారికి శ్రీ శైవక్షేత్రం పీఠాధిపతి శివ స్వామి సారెను సమర్పించారు. గురువారం ఉదయం సుమారు రెండు వందల మంది భక్తులతో కలిసి శివస్వామి అమ్మవారికి సారెను సమర్పించారు. సారెను సమర్పించిన అనంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం పొందారు.

Devotees from Telangana offer Golden Bonam to Kanaka Durga- The New Indian  Express

ఆపై శివస్వామికి అమ్మవారి శేష వస్త్రాలు, లడ్డూ ప్రసాదాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. ఇదిలా ఉంటే.. నేటి నుంచి హైదరాబాద్‌లో సైతం ఆషాడ బోనాలు ప్రారంభంకానున్నాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి నేడు బంగారం బోనం సమర్పించనున్నారు. దీంతో గోల్కొండ పరిసరాలు పండగవాతావరణం ఏర్పడింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version