ప్రస్తుతం ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న యాషెస్ 3వ టెస్ట్ లో ఇంగ్లాండ్ పట్టు బిగిస్తోంది. కాగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 8 వికెట్లు కోల్పోయి బ్యాటింగ్ ను కొనసాగిస్తోంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చెత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. టెస్ట్ మ్యాచ్ లలో ఒక బౌలర్ ఎక్కువ సార్లు ఔట్ చేసిన ఆటగాడిగా వార్నర్ బ్యాడ్ రికార్డ్ ను సాధించాడు. ఇంగ్లాండ్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ వార్నర్ ను కేవలం 4 పరుగుల వద్ద ఉండగా ఔట్ చేసి.. ఇతన్ని ఇప్పటి వరకు 16 సార్లు ఔట్ చేశాడు.
యాషెస్ టెస్ట్: టెస్ట్ లలో డేవిడ్ వార్నర్ చెత్త రికార్డ్… !
-