Big Boss Non Stop: కంటెస్టెంట్స్‌ను కన్ఫ్యూజ్ చేసిన నాగార్జున..ఏడ్చేసిన అషురెడ్డి..చివరకు?

-

‘బిగ్ బాస్’ ఓటీటీ షోలో కంటెస్టెంట్స్ ఎనిమిదో వారంలో దుమ్ము లేపారు.షో తొమ్మిదో వారంలోకి ఎంటర్ అయింది. ఆదివారం నాటి ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. హోస్ట్ అక్కినేని నాగార్జున కంటెస్టెంట్స్ ను తనదైన స్ట్రాటజీతో కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేసినట్లున్నారు.

బీబీ టీమ్ సూచనల మేరకు నాగార్జున కంటెస్టెంట్స్ అందరినీ హెచ్చరించి ప్రయత్నం చేస్తూనే నెక్స్ట్ గేమ్ ఎలా ఉండబోతుందనే హింట్ ఇచ్చినట్లు కనబడుతోంది. ఇక ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ టైమ్ లో కంటెస్టెంట్స్ ఎమోషనల్ అయ్యారు.

గేమ్ లో జరిగిన విషయాలను ప్రస్తావిస్తూ నాగార్జున కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడారు. ఒక్కొక్కరి స్ట్రెంత్స్ అండ్ వీక్ నెస్ లను చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశారు. అయితే, బిందు తన పర్సనాలిటీని మరోసారి ప్రూవ్ చేసుకుంది.

అజయ్ ఎలిమినేట్ అయినట్లు చెప్పగానే అషురెడ్డి కన్నీటి పర్యంతమైంది. కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎమోషనల్ అవుతారు. అఖిల్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు. అయితే, అజయ్ మాత్రం హుందాగానే బయటకు వచ్చేశాడు.

ఎవరిపైన ఎటువంటి నెగెటివ్ కామెంట్స్ చేయకుండా సరైన సూచనలు, సలహాలు ఇచ్చాడు. బ్రోకెన్ హార్ట్..ఫుల్ హార్ట్..టాస్క్ సందర్భంగా ప్రతీ ఒక్క కంటెస్టెంట్ కు గేమ్ ఎలా ఆడాలో తనదైన శైలిలో సూచనలు ఇచ్చి వచ్చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version