తెలుగు ప్రేక్షకులకు ఆషూ రెడ్డి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ సినిమాల కంటే సోషల్ మీడియా లోనే ఎక్కువగా పాపులర్ అయిందని చెప్పవచ్చు. బిగ్ బాస్ షోలో కంటిస్టెంట్ గా పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే అందరిలాగా ఆషూ రెడ్డి బిగ్ బాస్ షో కి వెళితే తన కెరియర్ మారుతుంది అనుకుంది కానీ ఈ ముద్దుగుమ్మ షో లో పాల్గొన్న తర్వాత అంతగా కలిసి రాలేదని చెప్పవచ్చు. ఇక అవకాశాల కోసం అందాల ఆరబోతున్న నమ్ముకుంది ఈ ముద్దుగుమ్మ ఈ క్రమంలోనే బోల్డ్ గా తన అందాలను ప్రదర్శిస్తూ ఫోటోషూట్లను వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇక గతంలో కూడా రాంగోపాల్ వర్మా తో ఒక వీడియోని చేయడం జరిగింది.
ఆషూ రెడ్డి షేర్ చేసేటువంటి పోస్ట్లు సైతం కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇంస్టాగ్రామ్ నుంచి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. స్విమ్మింగ్ పూల్ స్విమ్ సూట్ ధరించి ఘాటైన ఫోజులు ఇస్తూ ఫోటోలను షేర్ చేసింది. ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతకు ఫిదా అయిన నేటిజెన్లు సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. పలువురు సెలబ్రిటీలు సైతం ఆషూరెడ్డి పైన పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ విన్నర్ అయిన రాహుల్ సింప్లిగంజితో కూడా గతంలో ప్రేమ వ్యవహారం నడిపినట్లు వార్తలు వినిపించాయి. కాని కేవలం మేమిద్దరం స్నేహితులే అని తెలియజేసింది.
అయితే తాజాగా ఇప్పుడు ఈ ఫోటోల పైన రాహుల్ స్పందిస్తూ” నీకు నచ్చినట్టు నువ్వు బతకాలంటే ఖచ్చితంగా గడ్స్ ఉండాలి.. అలా నువ్వు బతుకుతున్నందుకు నీకు నా అభినందలు అంటూ కామెంట్స్ చేయడం జరిగింది”.. అలాగే ఆషూ రెడ్డి కూడా నా జీవితంలో నేను అసలు కాంప్రమైజ్ కానని అలాగే తనకు ఇంతగా ప్రోత్సహించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కూడా తెలియజేసింది. ఇక వేరే కాకుండా మరి కొంతమంది కూడా స్పందించారు.