ఆ ఫోటోలతో ట్రోలర్స్ కి మరోసారి బుక్కయిన అషు రెడ్డి..!

-

అషూ రెడ్డి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకొని ఆ విధంగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి వరకు సోషల్ మీడియా ప్రేక్షకులను అలరించిన అషూ రెడ్డి ‘బిగ్ బాస్’ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించింది. బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న అషూ రెడ్డి ‘బిగ్ బాస్’ హౌస్ నుండి బయటకి వచ్చాక కూడా సోషల్ మీడియాలో తన స్పీడ్ ను ఏ మొత్తం తగ్గించలేదు.

ఇది ఇలా ఉంటే అషూ రెడ్డి , రామ్ గోపాల్ వర్మ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇది మాత్రమే కాకుండా అషూ రెడ్డి ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తు ఉంటుంది. తాజాగా కూడా అషూ రెడ్డి తన ఇన్ స్టా లో ఒక ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో అషూ రెడ్డి టార్న్‌ డెనిమ్‌ షర్ట్‌ వేసుకొని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.

ఈ ఫోటో కు అషు రెడ్డి చినిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని ఒక పెద్దాయన చెప్పాడు అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. అషూ రెడ్డి పోస్ట్ చేసిన ఈ ఫోటోను చూసిన కొంతమంది నెటిజన్లు పాపం అషూ రెడ్డి మీద కుక్కలు దాడి చేశాయేమో చొక్కా మొత్తం తిరిగింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే చిరిగిన చొక్కా వేసుకున్నావ్ మరి పుస్తకం కొనుక్కున్నావా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news