కారులో ఆశావాహులు..జంప్ అయిపోదామా?

-

రాజకీయాల్లో ఒక వ్యూహం వేస్తే..మరొక ప్రతి వ్యూహం వేసి చెక్ పెడతారు. అలాగే సొంత పార్టీలోని పరిస్తితులని చక్కదిద్దడానికి ఒక వ్యూహంతో ముందుకొస్తే..అది ఒక కోణంలో సక్సెస్ అవ్వచ్చు..కానీ మరొక కోణంలో ఫెయిల్ అవ్వడం ఖాయం. ఇప్పుడు కేసీఆర్ వేసిన వ్యూహం అలాగే అయ్యేలా ఉంది. రెండోసారి అధికారంలో కొనసాగుతున్న టి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో కొంతమందిపై వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం..వారికి మళ్ళీ సీటు ఇస్తే గెలుపు ఈజీ కాదు. ఆ విషయంలో పలురకాల సర్వేల రూపంలో కేసీఆర్‌కు రిపోర్టులు వచ్చాయి.

అలాంటప్పుడు కేసీఆర్..కొంతమందికి సిట్టింగులకు సీట్లు ఇవ్వకుండా వారి స్థానాల్లో కొత్తవారిని బరిలో దించాలి. అలా చేస్తే సక్సెస్ అవుతుందా? ఫెయిల్ అవుతుందా? తర్వాత తెలుస్తోంది..కానీ సిట్టింగులకు సీటు దక్కకపోతే..వారు వేరే ఆప్షన్ చూసుకుంటారు..ఎంత సర్దిచెప్పిన కొందరు వేరే పార్టీలోకి వెళ్ళి సీటు తెచ్చుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పుడు అదే దిశగా కొందరు సిట్టింగులు చూస్తున్నారనే ప్రచారం ఉంది. వారి కోసం బీజేపీ కూడా కాచుకుని కూర్చుంది. టైమ్ చూసి కొంతమందిని లాగాలని చూస్తుంది.

అదే జరిగితే టీఆర్ఎస్ పార్టీకి ఎంతోకొంత నష్టమైతే జరగడం ఖాయం. ఈ విషయాన్ని కూడా కేసీఆర్ అంచనా వేసుకున్నారు..అందుకే ఇటీవల తెలివిగా సిట్టింగుల అందరికీ సీటు అని ప్రకటించారు..అంటే జంపింగులకు భయపడి అందరికీ సీట్లు ఇచ్చేస్తామని చెప్పారు. సరే ఇలా చేయడం వల్ల సిట్టింగ్ ఎమ్మెల్యేల జంపింగులు ఆగుతాయని అనుకుందాం..కానీ సీట్లు ఆశిస్తున్న ఆశావాహుల పరిస్తితి ఏంటి? వారు వేరే పార్టీలోకి జంప్ అవ్వాలని చూస్తారు.

ఇప్పటికే ఒకో నియోజకవర్గంలో సిట్టింగ్‌లతో పాటు ఒకరిద్దరు ఆశావాహులు సీటు ఆశిస్తున్నారు. ఎప్పటినుంచో కొన్ని నియోజకవర్గాల్లో సీట్ల గురించి ఆధిపత్య పోరు కూడా జరుగుతుంది. అలాంటప్పుడు ఇప్పుడు సిట్టింగులకు సీటు అని ప్రకటించడం వల్ల టికెట్లు ఆశించే ఆశావాహులు..వేరే పార్టీలోకి వెళ్ళే ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే జంప్ అయిపోదామా? అని చూస్తున్నారు. అంటే ఎటు చూసుకున్న కేసీఆర్ వ్యూహం ఫెయిల్ అయ్యేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news