టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన హ్యాండ్సమ్ లుక్ తో.. తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు అక్కినేని అఖిల్. 2015 సంవత్సరంలో వచ్చిన అఖిల్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు అక్కినేని అఖిల్. అయితే అప్పటి నుంచి మంచి హిట్ లేకుండా నడిపిస్తున్న అఖిల్ కు.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మంచి బూస్ట్ ను అందించింది.
ఇది ఇలా ఉండగా తాజాగా ఏజెంట్ సినిమాకు సంబంధించి ఓ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర బృందం సభ్యులు. ఇక ఈ లుక్ లో అఖిల్ ఫుల్ ఎనర్జీ గా కనిపించారు. అంతేకాదు హాలీవుడ్ హీరోలా కండలు పెంచి అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు అక్కినేని అఖిల్. ఇక ప్రస్తుతం ఈ కండలు తిరిగిన పోస్టరు… సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ లుక్ చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అసలు అక్కినేని అఖిలేనా అన్నట్లుగా షాక్ అవుతున్నారు నెటిజన్లు.