అవతార్ 2.. ఇప్పటివరకు ఎన్ని కోట్ల కలెక్షన్స్ వసూల్ చేసిందంటే.?

-

ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామరూన్ స్వీయ నిర్మాణంతో పాటు దర్శకత్వంలో వచ్చిన అవతార్ 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 180 కి పైగా భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా, ప్రపంచ దేశాలు అనే తేడా లేకుండా కాసుల కుంభవృష్టి కురిపిస్తోందని చెప్పవచ్చు. ఇకపోతే డిసెంబర్ 16వ తేదీన విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. ముఖ్యంగా 10 రోజులకు గానూ ఎన్ని కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది అనే విషయానికి వస్తే.. అవతార్ 2 చిత్రం 350 మిలియన్ డాలర్ల వ్యయంతో అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.2900 కోట్ల బడ్జెట్ తో విడుదల అయ్యింది.

ఈ చిత్రం ఇండియాలోనే 3800 థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాను తొలి వారంలో దాదాపు 17వేల షోలు ప్రదర్శించారు. ఈ చిత్రం విడుదలైన ప్రతి చోటా కూడా భారీ వసూళ్ళను రాబట్టింది. ఇకపోతే ఈ చిత్రం విడుదలైన తొలి రోజు రూ.13.65 కోట్ల షేర్ సాధించింది. రెండవ రోజు రూ.10.85 కోట్లు.. మూడవరోజు రూ.12.60 కోట్లు రాబట్టింది. గత తొమ్మిది రోజుల్లో మొత్తం రూ.60 కోట్లకు పైగా వసూళ్ళను సాధించిన ఈ సినిమా పదవరోజు రూ. 6.45 కోట్ల కలెక్షన్స్ నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం ఆంధ్ర ,నైజాం , సీడెడ్ లో కలిపి రూ.66 కోట్లకు పైగా వసూలు రాబట్టినట్లు సమాచారం.

ఇక ప్రపంచవ్యాప్తంగా విషయానికి వస్తే.. ఇప్పటివరకు 880మిలియన్ డాలర్లకు పైగా అంటే భారతీయ కరెన్సీ ప్రకారం 7300 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అమెరికాలో 253 మిలియన్ డాలర్లు, ఓవర్సీస్ లో 601 మిలియన్ డాలర్లు, ప్రపంచవ్యాప్తంగా 85 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.4400 కోట్ల లాభాలను పంచిపెట్టింది

Read more RELATED
Recommended to you

Latest news