అవకాడో సాగు విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!

-

అవకాడో అనేది మెక్సికోకు చెందిన వృక్షం..అవకాడో యొక్క శాస్త్రీయనామం పెర్సీ అమెరికాన. దీన్ని అల్లెగటర్‌ పీయర్‌ లేక బట్టర్‌ ఫ్రూట్‌ అని అంటారు. ప్రపంచంలో ఉండే మొత్తం అవకాడోలో సగం కేవలం అమెరికా ప్రజలు తింటారు. అవకాడో పియర్‌ పండు మాదిరిగా మరియు గుడ్డు ఆకారంలో లాగా కనిపిస్తుంది. దీనిలో కేవలం ఒకటే విత్తనం ఉంటుంది. ఈ విత్తనం చుట్టూ పండు యొక్క గుజ్జు ఉంటుంది. దీని యొక్క చర్మం చూడటానికి కొంచెం కఠినంగా ఎగుడు దిగుడుగా కనిపిస్తుంది. బాగా పండిన అవకాడో మాత్రం పర్పల్‌ బ్లాక్‌ రంగులో ఉంటుంది దీని యొక్క రుచి కొంచెం తియ్యగా మరియు వెన్న లాగా ఉంటుంది. ఒక్కసారి తింటేనే దాని రుచి అనేది తెలుస్తుంది..

ఈ చెట్టు సుమారు 66 నుండి 67 అడుగుల ఎత్తు పెరుగుతుంది. 12 సెంటీమీటర్ల నుండి 25 సెంటీమీటర్ల పొడవు ఆకులు ఐదు నుండి పది మీటర్లు వెడల్పు పువ్వు ఏడు నుండి ఎనిమిది అంగుళాల పొడవు గల కాయ కలిగిఉంటుంది. అవకాడో వ్యాపారపరంగా మంచి విలువ గల పంట కాబట్టి ఈ పంటకు వాతావరణం గల ప్రపంచంలోని అన్ని శీతోష్ణ ప్రాంతాల్లో పెరుగుతుంది..

ఇకపోతే ఈ చెట్లను సారవంతమైన ఎర్రటి నేలల్లో పెంచుతారు.పెరు, పోర్చుగీస్‌, మొరొకొ, క్త్రెతె, లెవాంట్‌, దక్షిణాఫ్రికా, కొలంబియా, చిలీ, వియత్నాం, ఇండోనేషియా, శ్రీలంక, దక్షిణ భారతదేశం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఫిలిప్పీన్స్‌, మలేషియా, కరేబియాన్‌, మెక్సికో, హవాయి, ఈక్వేడర్‌ మరియు న్యూమెక్సికో. విత్తనం నాటిన నాలుగు నుండి ఆరు సంవత్సరాలకు వెన్న చెట్లు కోతకు వస్తాయి. ఇవి చెట్టున ఉన్నప్పుడే మగ్గుతాయి. కానీ వాణిజ్యంగా పండిరచే వారు వీటిని పచ్చిగానే ఉన్నప్పుడు కోసి 3.3 నుండి 5.50సెం. మగ్గడం కోసం భద్రపరుస్తారు..మన రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఈ పంటను ఎవరూ వేయలేదు..వీటి గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే దగ్గరలొని వ్యవసాయ నిపునులను అడిగి తెలుసుకోవడం మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news