తెల్లబొల్లి మచ్చలు ఉంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..కాఫీ తాగేస్తున్నారా..?

-

చర్మం మీద బొల్లిమచ్చలు ఏర్పడటం చాలామందిలో చూసే ఉంటారు. ఇవి బాడీలో ఒక చిన్న మచ్చగా స్టాట్‌ అయి అవే వ్యాపిస్తూ పెద్దవి అవుతాయి. ముఖం మీద ఇలాంటి మచ్చలు వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ చర్మ వ్యాధి సాధారణంగా 30 ఏళ్ల తర్వాత కనిపిస్తుంది. కొంతమందికి ముఖం మీద లేదా శరీరంలోని ఇతర భాగాలపై తెల్లటి మచ్చలు కనిపించవచ్చు. ఈ సమస్య ఉన్నవారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.

బొల్లితో బాధపడుతున్న రోగులకు వైద్యపరంగా కచ్చితంగా ఏం తినాలి అని ఏం లేదు.. అయినప్పటికీ, కొన్ని ఆహారాలు తీసుకోవడం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని చాలా అధ్యయనాలు నిరూపించాయి. ప్రతి ఒక్కరి శరీరం భిన్నంగా ఉంటుంది. కొన్ని ఆహారాలను తీసుకుంటే ఇన్‌ఫెక్షన్‌ గురయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ఈ సమస్య చేతులు, కాళ్లు, ముఖం మీద మొదలవుతుంది. కానీ శ్లేష్మ పొరలు నోరు, ముక్కు, జననేంద్రియాలు, పురీషనాళం యొక్క తేమతో కూడిన పొర, కళ్ళు, లోపలి చెవితో సహా శరీరంలో ఎక్కడైనా వ్యాపించవచ్చు.

చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్‌ కణజాలాలు విడుదల చేసే మెలనిన్‌ అనే ప్రత్యేక పదార్థం టైరోసినేజ్‌ అనే ఎంజైమ్‌ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. తెల్ల బొల్లి మచ్చల వ్యాధిలో ఈ ఎంజైమ్‌ అనేక కారణాల వల్ల క్షీణిస్తుంది. ఫలితంగా మెలనిన్‌ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మ రంగును కోల్పోతుంది.

వైన్, బ్లూబెర్రీస్, సిట్రస్, కాఫీ, పెరుగు, చేపలు, పండ్ల రసం, ఉసిరి, ద్రాక్ష, ఊరగాయలు, దానిమ్మ, పియర్, రెడ్ మీట్, టొమాటో, గోధుమ ఉత్పత్తులు, పుల్లని పదార్థాలకు దూరంగా ఉండండి. ఏ ఆహారాల పదార్థాలు అయితే మెలనిన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయో అలాంటివి తింటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.

వేప ఆకుల పేస్ట్ ను మజ్జిగలో కలిపి రాత్రిపూట మచ్చలు ఉన్న ప్రదేశంలో పోయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడంతో మంచి ఫలితం పొందుతారు. దానిమ్మ ఆకులలో (Pomegranate leaves) ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఎండిన దానిమ్మ ఆకులను మెత్తగా నూరి పొడి చేసుకోవాలి. ఈ పొడిని బొల్లి ఉన్న ప్రదేశంలో రాసుకోవాలి. బొల్లి తగ్గుముఖం పడుతుంది.
Attachments area

Read more RELATED
Recommended to you

Latest news