కరోనా నుండి పిల్లలని సురక్షితంగా ఉంచడానికి ఆయుష్ మినిస్టరీ జారీ చేసిన గైడ్లైన్స్..!

-

కరోనా వైరస్ కారణంగా అనేక మంది ఎన్నో ఇబ్బందులు బారిన పడుతున్నారు. అయితే ఇప్పటికే కరోనా లో రెండు వేవ్స్ ని మనం చూశాం. కరోనా మూడవ కూడా త్వరలో వస్తుందని మనం విన్నాం. అయితే పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనే దానిపై ఆ విషయం మినిస్ట్రీ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.

బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం, యోగా వంటి పద్ధతుల్ని పాటించడం, ఆయుర్వేద ఔషధాలను తీసుకోవడం ఇలాంటివి చేయమని సూచిస్తోంది. పిల్లల్లో చాలా తక్కువగా కరోనా వైరస్ వస్తోందనిపెద్దలతో పోల్చుకుంటే వాళ్ళల్లో ఇన్ఫెక్షన్ తక్కువగా ఉంటుందని చెప్పింది.

ఈ వైరస్ నుండి పిల్లల్ని సురక్షితంగా ఉంచడానికి 58 పేజీల డాక్యుమెంట్ ని మినిస్ట్రీ విడుదల చేసింది. ఆయుర్వేద ఔషధాలతో కరోనా రిస్కు తగ్గుతోందని చెప్పింది. అదే విధంగా ఒబిసిటీ, టైప్ 1 డయాబెటిస్, క్రోనిక్ కార్డియో పల్మనరీ డిసీజ్ వంటి సమస్యలు ఉన్న పిల్లల్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పింది.

అయితే పిల్లల్లో ఏమైనా సమస్యలు ఉంటే నాణ్యమైన వాయిస్ ఫిజీషియన్ ని సంప్రదించండి మినిస్ట్రీ చెప్పింది. మళ్లీ వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ పై కూడా శ్రద్ధ పెట్టాలని చెప్పింది.

పిల్లలకి కొన్ని సలహాలు:

పిల్లల్ని పదేపదే చేతులు కడుక్కోమని, మాస్క్ ని ధరించమని చెప్పింది. ఒకవేళ కనుక పిల్లలు మాట వినకపోతే రివార్డ్ లాంటివి తల్లిదండ్రులు ఇచ్చి వాళ్ళు మాస్క్ వేసుకునేలా చూసుకోమని చెప్పింది.

పిల్లలకి మూడు లేయర్లు ఉన్న కాటన్ మాస్క్ రిఫర్ చేయమని.. మంచి రంగు, ఆకర్షణీయంగా కనిపించేవి కొంటె పిల్లలు వేసుకుంటారు అని చెప్పింది. అదే విధంగా పిల్లల్ని ఎక్కడికి తీసుకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉంచమని సూచించింది. కావాలంటే స్నేహితులతో కుటుంబ సభ్యులతో వీడియో కాల్స్, ఫోన్ కాల్స్ ద్వారా మాట్లాడమని చెప్పింది.

పిల్లలకి కరోనా లక్షణాలు ఉంటే వాళ్ళని పెద్ద వాళ్ళకి దూరంగా ఉంచమని చెప్పింది. ఐదు రోజులు కంటే ఎక్కువ జ్వరం ఉన్నా, ఎక్కువ నీరసంగా అనిపించినా, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిన, రెస్పిరేటరీ రేటు పెరిగినా వాళ్లని డాక్టర్ కి కన్సల్ట్ చేయమని చెప్పింది.

గోరు వెచ్చని నీళ్లు తాగడం, హైజిన్ గా ఉండడం, సరిగ్గా బ్రష్ చేయడం (ఉదయం రాత్రి కూడా దంతాలను తోముకోవడం), ఆయిల్ పుల్లింగ్ లేదా గార్గిలింగ్ వంటివి పాటించడం మంచిదని చెప్పారు.

ప్రాణాయామ, మెడిటేషన్ లాంటివి కూడా వాడికి బాగా ఉపయోగపడతాయని వాటిని కూడా పిల్లలకు నేర్పించమని చెప్పింది. రోగనిరోధక శక్తి పెరగడానికి పసుపు పాలు ఇవ్వమని మినిస్ట్రీ సూచించింది. సరైన నిద్ర, సరైన ఆహారం ఉండాలని..

సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి అని చెప్పింది. ఈ సమయంలో వాళ్ళు కష్ట పడకుండా జాగ్రత్తగా తల్లిదండ్రులు చూసుకోమని తల్లిదండ్రులకి ఆయుష్ మినిస్ట్రీ వీటిని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version