టీడీపీ సీనియర్ నాయకులు అయ్యన్న పాత్రుడు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 2000 మంది పోలీసులు ముఖ్యమంత్రికి భద్రత ఇవ్వటానికి మరొక 2 వేల మంది ప్రతి పక్షాన్ని అదుపు చేయటానికి సరిపోతున్నారని, ఇంకా సంఘటనలు జరగకుండా ప్రభుత్వం ఏలాంటి యాక్షన్ తీసుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. అత్యాచారం జరిగిన బాధితులకు పరిహారం ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, దేశంలో ఎక్కడ గంజాయి సప్లై జరుగుతున్న దాని మూలాలు విశాఖ జిల్లాలోని కనిపిస్తున్నాయన్నారు. గంజాయి వ్యాపారుల ఫోటోలతో ప్రభుత్వం ప్రకటన ఇవ్వండి.. గంజాయి వ్యాపారంలో ఎవరు చేస్తున్నారో పోలీసులకు ఎక్సైజ్ అధికారులకు తెలియదా.. వాళ్ళు ఇస్తున్న ముడుపులు వీళ్లకు అందుతున్నాయంటూ ఆరోపించారు.
విద్యార్థులు గంజాయి బానిసలవుతున్నారని, భవిష్యత్తులో దేనికి పనికిరాకుండా పోతారంటూ మండిపడ్డారు. రాష్ట్ర మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ అధికారంలోకి వచ్చాక అత్యాచార సంఘటనపై ఎంతమందిని విచారించారని, ఎంతమందికి నోటీసు ఇచ్చారు, కనీసం పరిష్కారమైన చెప్పారా అని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు పై మాత్రం నోటీసులు ఇస్తారు. హోమ్ మంత్రి ఎం చేస్తున్నారూ.. పిల్లల తయారవటానికి తల్లిదండ్రుల పెంపకం కారణమని హోంమంత్రి అంటున్నారు.. మరి సీఎం జగన్ ను వాళ్ల తల్లిదండ్రులు ఎలా పెంచారో.. రాష్ట్రంలో దొంగోడి కి పోలీసులు కాపలా కాస్తున్నారు.. అంటూ అయ్యన్న పాత్రుడు ధ్వజమెత్తారు.