అయ్యన్నతో టీడీపీకి ఊపు..వైసీపీకి ఒరిగింది ఏంటి?

-

రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా ఉందంటే డౌట్ లేకుండా అధికార వైసీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉందని చెప్పొచ్చు. ఇక వైసీపీ దెబ్బకు టీడీపీ గడ్డు పరిస్తితుల్లో ఉంది. ఇది కూడా వాస్తవమే. కానీ ఈ పరిస్తితి ఉంది..వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదట ఏడాదిలో మాత్రమే. ఆ తర్వాత నుంచి టీడీపీ బలం పెరుగుతూ వస్తుంది. అయితే టీడీపీ బలం పెంచేది టీడీపీ నేతలు కాదు..వైసీపీ మాత్రం. వైసీపీ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆ పార్టీ చేస్తున్న రాజకీయమే పరోక్షంగా టీడీపీకి ప్లస్ అవుతుంది.

ఎక్కడకక్కడ టీడీపీని అణిచివేయాలని క్రమంలో వైసీపీ చేస్తున్న పనులే టీడీపీకి ప్లస్. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి రాజకీయం చేయడంతో టీడీపీ బలం పెరుగుతూ వస్తుంది. అలాగే కొందరు నేతలని కావాలని వైసీపీ టార్గెట్ చేస్తుంది. ఈ క్రమంలో చాలామంది టీడీపీ నేతలపై కేసులు, అరెస్టులు జరిగాయి. ఇక జైలుకు వెళ్ళిన ప్రతి టీడీపీ నాయకుడు మైలేజ్ వైసీపీనే పెంచుతుంది. అలాగే చంద్రబాబు, లోకేష్‌లని అడ్డుకోవడం లాంటివి, కార్యకర్తలని అరెస్ట్ చేయడం, రాజకీయంగా ఇబ్బంది పెట్టడం లాంటివి కూడా వైసీపీకే మైనస్ అవుతున్నాయి.

అంటే చావు బ్రతుకుల మధ్య ఉన్న టీడీపీకి వైసీపీనే ఊపిరి పోసింది. ఇప్పుడు తాజాగా సీనియర్ నేత అయ్యన్నపాత్రుని అరెస్ట్ చేశారు. తన ఇంటికి గోడకు సంబంధించి నకిలీ పత్రాలు ఇచ్చారని అరెస్ట్ చేశారు. ఇలా అయ్యన్నని అరెస్ట్ చేశారో లేదో..వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు అలెర్ట్ అయ్యారు. అయ్యన్న అరెస్ట్‌ని ఖండిస్తూ..నిరసనలు తెలియజేస్తున్నారు. చంద్రబాబు దగ్గర నుంచి చిన్న నాయకుడు వరకు అయ్యన్న కోసం పోరాడారు.

Telugu Desam Party - Wikipedia

అయితే పెద్ద భూ కబ్జాలు, ఇసుక అక్రమాలు, కోట్ల అవినీతి లాంటి కార్యక్రమాలు అయ్యన్న చేయలేదని, ఒక గోడకు సంబంధించి కేసు పెట్టారని, అందులో అయ్యన్న తప్పులేదని, పైగా ఆ ఇల్లు అయ్యన్న కొడుకులు పేరు మీద ఉందని, కక్షపూరితంగా కావాలని అయ్యన్నని అరెస్ట్ చేశారని మండిపడుతున్నారు. ఇక అరెస్ట్ చేసినంత సేపు కూడా లేకుండా వైజాగ్ కోర్టు..అయ్యన్నకు బెయిల్ ఇచ్చింది.

ఈ కేసులో అయ్యన్నని రిమాండ్ తీసుకోవాల్సిన సెక్షన్లు లేవని చెప్పి..బెయిల్ మంజూరు చేసింది. ఆ వెంటనే అయ్యన్న, తన తనయుడు బయటకొచ్చారు.ఇక ఇలా అరెస్ట్‌లు వల్ల ఇప్పటికే పలు టీడీపీ నేతలకు ప్రజల్లో సానుభూతి వచ్చింది. ఇప్పుడు అయ్యన్నపై సింపతీ పెరిగేలా చేశారు..దీని వల్ల అయ్యన్నకే ప్లస్. అలాగే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి ఇంకా ఊపు తెస్తున్నారు అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news