యాక్టివ్‌గా లేకపోవడం, ఇమ్యూనిటీ లోపం, అరికాళ్లలో మంటలు.. ఇవన్నీ బి12 విటమిన్ లోపం లక్షణాలు. తరచూ నీరసంగా అనిపిస్తుంటే మీరు తీసుకునే ఆహారంలో బి12 విటమిన్ లోపించిందని అర్థం. అందుకే బి12 విటమిన్ పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఏయే ఆహారంలో బి12 విటమిన్ ఉంటుందో కొంతమందికి తెలియదు. ఇంతకీ బి12 విటమిన్ ఎందులో పుష్కలంకా ఉంటుందంటే..?
నాన్‌వెజ్.. అదేనండీ చికెన్, మటన్.. కొంతమందికి వీటిలో లివర్ నచ్చదు. అందుకే తీసి పక్కన పడేస్తుంటారు. కానీ లివర్ ఆరోగ్యానికి చాలా మంచిదట. ముఖ్యంగా మటన్‌లోని లివర్ రోజువారీ అవసరాలకు సరిపడే బి12ని అందిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.
చిరుధాన్యాలన్నింటినీ కలిపి చేసిన గ్రనోలాబార్లు మనకు తేలిగ్గానే దొరుకుతాయి. వారంలో ఒకటి రెండు సార్లు తిన్నారంటే.. శరీరానికి కావల్సిన పీచుతో పాటు బి12 లోపం రాకుండా ఉంటుంది.
పాలు, పెరుగు, చీజ్ అన్నింటి నుంచీ ఈ కీలకమైన విటమిన్ అందుతుంది. ఒక చీజ్ స్లైస్ నుంచి మన రోజువారీ అవసరాలకు కావాల్సిన 28 శాతం బి12 అందుతుంది.
రోజులో రెండు గుడ్లు తింటే ఈ విటమిన్ లోపానికి చెక్ పెట్టొచ్చు. వాస్తవానికి తెల్లసొనలో కన్నా.. పచ్చసొనలో ఎక్కువగా బి12 ఉంటుంది. గుడ్డుని మొత్తంగా తినడం వల్లనే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వారంలో రెండు లేదా మూడుసార్లు చేపల్ని తింటే శరీరానికి కావాల్సిన ఒమెగా ఆమ్లాలతోపాటు.. ఈ విటమిన్ కూడా అందుతుంది.