నగరిపై బాబు ఫోకస్..రోజాకు కొత్త కష్టాలు?

-

రోజురోజుకూ టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు పెరుగుతుంది…వయసు మీద పడుతున్న కూడా తనలో సత్తా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు…జిల్లాల పర్యటన చేస్తూ…టీడీపీని గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు…ఇప్పటికే మినీ మహానాడు, రోడ్ షోలతో బాబు సత్తా చాటుతున్నారు. అలాగే పార్లమెంట్ స్థానాల వారీగా నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహించి…పార్టీని బలోపేతం చేయడంపై కృషి చేస్తున్నారు.

ఇదే క్రమంలో బాబు…తాజాగా నగరిలో రోడ్ షో నిర్వహించారు..చాలా రోజుల తర్వాత బాబుకు నగరికి వచ్చినా సరే..ప్రజలు పెద్ద ఎత్తున మద్ధతు పలికారు. అలాగే నగరిలో ఎలాగైనా టీడీపీ జెండా ఎగరవేయాలనే కసితో అక్కడి టీడీపీ శ్రేణులు ఉన్నాయి. ఇదే క్రమంలో టీడీపీ నేతలకు, కార్యకర్తలకు నగరిలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై దిశ నిర్దేశం చేశారు. అయితే తాజాగా బాబు రోడ్ షోకు వచ్చిన జనాలని చూస్తుంటే…నగరిలో టీడీపీ పుంజుకుంటున్నట్లే కనిపిస్తోంది.

అసలు నగరిలో టీడీపీకి పెద్ద బలం లేదనే చెప్పొచ్చు..గతంలో ఇక్కడ రెండు సార్లు మాత్రమే గెలిచింది…1994, 2009 ఎన్నికల్లో మాత్రమే గెలిచింది..అయితే 2014, 2019 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీల తేడాతో టీడీపీ ఓడిపోయింది…వైసీపీ నుంచి పోటీ చేసిన రోజా రెండుసార్లు గెలిచారు..ప్రస్తుతానికి ఆమె మంత్రిగా ఉన్నారు. మంత్రిగా ఉన్న సరే…నగరిలో రోజా పరిస్తితి అంత ఏమి బాగోలేదనే చెప్పొచ్చు…ఎందుకంటే ఇప్పటికే సొంత పార్టీ నుంచే ఆమె వ్యతిరేకత ఎదురుకుంటున్నారు. వైసీపీలో మరో వర్గం రోజాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే…వచ్చే ఎన్నికల్లో రోజాకు మళ్ళీ సీటు ఇస్తే ఖచ్చితంగా ఓడిస్తామని సొంత పార్టీ వాళ్లే చెబుతున్నారు.

ఇలా సొంత పార్టీతోనే రోజాకు తలనొప్పి ఉందనుకుంటే..ఇప్పుడు టీడీపీ అనూహ్యంగా పుంజుకోవడం రోజాకు కాస్త మైనస్ గా మారింది. నెక్స్ట్ ఎన్నికల్లో రోజాకు టీడీపీ గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. ఏదేమైనా ఈ సారి నగరిలో రోజా గెలుపు కాస్త కష్టమయ్యేలా ఉంది…చూడాలి మరి ఈ సారి రోజా హ్యాట్రిక్ కొట్టగలరో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news