అనిల్ రావిపూడి దర్శకత్వం లో మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో అబ్బబ్బ నెవ్వర్ బిఫోర్ నెవ్వర్ ఆఫ్టర్ సినిమాకే హైలెట్ డైలాగ్. ఇప్పుడు ఇదే డైలాగు తరహాలో అమరావతి రాజధాని భూముల విషయంలో ముఖ్యమంత్రి జగన్ మరియు ప్రతిపక్ష నేత చంద్రబాబు డ్రామాలు చేస్తున్నట్లు తాజా పరిస్థితులు బట్టి మేధావులు కామెంట్ చేస్తున్నారు.
మేటర్ లోకి వెళ్తే రాజధాని భూములను అడ్డంపెట్టుకుని రాష్ట్ర రాజకీయాల్లో కేవలం రెండు పార్టీల మధ్య ఆధిపత్యం ఉండేటట్లు జగన్ మరి చంద్రబాబు కావాలని డ్రామాలాడుతున్నారని రాజకీయ మేధావులు అంటున్నారు. మూడో బలమైన రాజకీయ పార్టీ రాష్ట్రంలో కి రాకుండా రాజధాని అమరావతి భూముల విషయంలో వైసిపి మరియు టిడిపి పార్టీ నాయకులు రాష్ట్ర ప్రజల ఆలోచన తప్పుదోవ పట్టించే విధంగా రాజకీయాలు చేస్తున్నాయన విమర్శలు వస్తున్నాయి.
ప్రజా సమస్యల విషయంలో రెండు పార్టీలు స్పందించకుండా కేవలం అమరావతిని పెద్ద సమస్యగా చిత్రీకరిస్తూ దాని చుట్టూ రాజకీయం చేస్తూ మరొక పార్టీ పై ప్రజల దృష్టి పడకుండా చంద్రబాబు – జగన్ ఆడుతున్న రాజకీయ గేమ్ అమరావతి అంటూ రాజకీయ విశ్లేషకులు ఏపీ అమరావతి రాజధాని విషయంలో జరుగుతున్న పరిణామాలపై కామెంట్ చేస్తున్నారు.